"హార్వే రాస్ బాల్" అనే వ్యక్తి ఈ స్మైలీ ఎమోజిని రోపొందించాడు. ఈయన USAలోని మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌లో పుట్టి పెరిగినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. అతను సౌత్ హైస్కూల్‌లో విద్యార్థిగా ఉన్న సమయంలో, అతను స్థానిక సైన్ పెయింటర్‌కు అప్రెంటిస్ గా మారాడట. ఆ తరువాత వోర్సెస్టర్ ఆర్ట్ మ్యూజియం స్కూల్‌లో అతను తన విద్యను అభ్యసించాడు. ఈ క్రమంలో అక్కడ అతను మాస్టర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ (లలిత కళలు) అభ్యసించాడు. ఈ క్రమంలో హార్వే బాల్ నేషనల్ గార్డ్‌లో 27 సంవత్సరాలు పని చేయడం జరిగింది. అతను కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదండోయ్... 1973లో బ్రిగేడియర్ జనరల్‌గా పదవీ విరమణ చేసి ఆ తర్వాత ఆర్మీ రిజర్వ్‌లో ఆరేళ్లు పనిచేశాడు కూడా.
ఇక 2వ ప్రపంచ యుద్ధం తరువాత, హార్వే బాల్ 1959లో తన స్వంత వ్యాపారమైన హార్వే బాల్ అడ్వర్టైజింగ్‌ను ప్రారంభించే వరకు స్థానిక ప్రకటనల సంస్థలోనే పనిచేసేవాడట. ఈ తరుణంలోనే హార్వే బాల్ 1963లో స్మిల్ ఇమేజిని రూపకల్పన చేసాడట. కాగా దీనిని స్టేట్ మ్యూచువల్ లైఫ్ అస్యూరెన్స్ కంపెనీ ఆఫ్ వోర్సెస్టర్, మసాచుసెట్స్ (ప్రస్తుతం హనోవర్ ఇన్సూరెన్స్) ఒహియోకు చెందిన గ్యారంటీ మ్యూచువల్ కంపెనీని దానిని కొనుగోలు చేసిందట. అందుకుగాను అతను తీసుకున్న మొత్తం అప్పట్లో 45 డాలర్లు. ఈ క్రమంలోనే బటన్‌లు, డెస్క్ కార్డ్‌లు మరియు పోస్టర్‌లపై ఉపయోగించేందుకు స్మైలీ ఫేస్‌ను వాడుకున్నట్టు తెలుస్తోంది. పది నిముషాల లోపే స్మైలీ ఫేస్ ఇమేజిని ఆయన పూర్తిచేశారని వినికిడి.
స్టేట్ మ్యూచువల్ ఉద్యోగులకు 100 స్మైలీ పిన్‌లను అందజేసే స్నేహ ప్రచారంలో భాగంగా స్మైలీ ఫేస్‌ని ఉపయోగించడం జరిగిందట. ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మరియు ఇతర పనులు చేస్తున్నప్పుడు ఉద్యోగులు చిరునవ్వుతో ఉండేలా చేయడమే దీని లక్ష్యం. కాగా 1971 నాటికి 50 మిలియన్లకు పైగా స్మైలీ ఫేస్ బటన్‌లు విక్రయించబడ్డాయని తెలుస్తోంది. దాంతో స్మైలీని అంతర్జాతీయ చిహ్నంగా అభివర్ణించారు అప్పటి విశ్లేషకులు. అయితే హార్వే బాల్ యొక్క స్మైలీబాల్ ఎప్పుడూ స్మైలీ యొక్క ట్రేడ్‌మార్క్ లేదా కాపీరైట్ కోసం దరఖాస్తు చేయలేదట. టెలిగ్రామ్ & గెజిట్ నివేదించిన ప్రకారం చార్లెస్ బాల్ "అతను డబ్బుని కోరుకొనే వ్యక్తి కాదని చెప్పుకొచ్చింది. ఈ తరుణంలో బ్రదర్స్ బెర్నార్డ్ మరియు ముర్రే స్పెయిన్ 1970ల ప్రారంభంలో స్మైలీ ఫేస్‌తో లైన్‌ను ట్రేడ్‌మార్క్ చేశారు.