మీరు సాధారణంకంటే ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటున్నారా..? అయితే ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే స్నేహ బంధాలు అనారోగ్యాల రిస్క్ ను తగ్గిస్తాయని, తరచుగా కలిసి చిల్లు అవ్వటం వల్ల ఆయుష్షును పెరుగుతుందని ' ఎపిడెమియాలాజి అండ్ సైకియాట్రిక్ సైన్స్ స్' జర్నల్ లో డబ్లిపైన ఆధ్యాయనం పరిశోధకుల అధ్యాయనంలోనూ ఇది వెల్లడయింది. అయితే ఫ్రెండ్ షిప్ జీవన ప్రయాణాన్ని పెంచడంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. స్నేహితులను కలిసి ఉండటం, తరచుగా వారితో కలిసి చిల్ అవటం వ్యక్తుల జీవన ప్రమాణం పై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవటానికి పరిశోధకులు 3, 849 మందిని రెండు కేటగిరీలుగా విభజించి,

సుదీర్ఘకాలం పాటు అబ్జర్వ్ చేశారు. వారు అనారోగ్యాలు, మరణం వంటి అంశాలను కూడా విశ్లేషించారు. కాగా వీధిలో తరచుగా స్నేహితులతో కలిసి మాట్లాడటం, సామాజిక పరస్పర చర్యల్లో పాల్గొనటం వంటి సంబంధాలు కలిగి ఉన్నవారు ఎక్కువ కాలం సంతోషంగా, ఆరోగ్యంగా జీవించారని పరిశోధకులు గుర్తించారు. అలాగే స్నేహితులతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నవారు ఎక్కువగా ఒంటరితనంతో బాధపడటమే కాకుండా, తక్కువ కాలం జీవించారని కూడా గుర్తించారు. అయితే మంచి స్నేహాల వల్ల మాత్రమే ఇక్కడ మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా రీసెర్చర్స్ ఎనలైజ్ చేశారు.

టాక్సిక్ ఫ్రెండ్ షిప్ ను పక్కన పెడితే మన మేలు కోరే స్నేహ బంధాలు ఆయుష్షు పెరగటంలో సహాయపడతాయని కనుగొన్నారు. వరి దుడుకులు ఎదురైనప్పుడు సహాయంగా నిలవడం, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేని విషయాలను, సమస్యలను పరిష్కరించడంలో స్నేహితులు ముందుంటున్నారని రీసెర్చ్ ర్స్ పేర్కొన్నారు. అలాగే అనారోగ్యాలు సంభవించినప్పుడు, ప్రియమైన వారు దూరమైనప్పుడు భావోద్వేగా మద్దతును మందులు అందించడంలో, కష్టాల నుంచి బయట పడేందుకు సహాయం చేయడంలో క్లోజ్ ఫ్రెండ్స్ సహాయపడుతున్నట్లు గుర్తించారు. స్త్రిలైనా, పురుషులైనా చక్కటి స్నేహ బంధాన్ని కలిగి ఉన్నప్పుడు అది వారి ఆనందానికి, ఆయుష్షు పెరగటానికి అదే దోహాడ్ పడుతుందని గమనించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: