ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా డయాబెటిస్ సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. మధుమేహంపై పరిశోధన కోసం దేశంలో బయోబ్యాంక్ కూడా ప్రారంభించారు.. డయాబెటిస్ అనేది ఒక వ్యాధి. అంటు వ్యాధి కానప్పటికి.. దీనికి ఇప్పటివరకు సరిగ్గా చికిత్స లేదు. దీనిని నియంత్రణలో మాత్రమే ఉంచుకోవచ్చు.. అయితే.. మధుమేహానికి ఎందుకు చికిత్స లేదు. దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారంటే. భారతదేశంలో డయాబెటిస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి.

 చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో భారత దేశంలో మధుమేహం నివారణ కోసం డయాబెటిస్ బయోబ్యాంక్ ను ప్రారంభించారు. ఈ డయాబెటిస్ బయోబ్యాంక్ ద్వారా మధుమేహ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స అందించవచ్చు. ఇది షుగర్ వ్యాధిని నివారించడానికి ఎంత సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. దేశంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు మధుమేహ బాధితులుగా మారుతున్న నేపథ్యంలో శాస్త్రీయ అధ్యాయనాలకు ఉపయోగపడే జీవ సమూనాలను సేవించడం, వాటిని ప్రాసెస్ చెయ్యటం, నిల్వ చేయడం, పంపిణీ చెయ్యటం ఈ బయో బ్యాంక్ లక్ష్యం. ఐసిఎంఆర్ ప్రకారం..

భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఈ వ్యాధి కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. శరీరంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల వచ్చే ఈ మధుమేహం వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. కానీ... దీన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అమెరికా, రష్యా, ఐరోపాలోని అనిత దేశాలలో మధుమేహం పూర్తి చికిత్స పై అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ఇప్పటివరకు ఎటువంటి ఔషధం లేదా వ్యాక్సిన్ తయారు చేయలేదు. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సక్రమంగా పనిచేయక, షుగర్ లెవెల్ పెరిగితే మధుమేహం వస్తుందని ఢిల్లీలోని జిటిబి ఆస్పత్రిలోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ అజిత్ కుమార్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: