బెల్లం కంటే ఈ తాళి బెల్లం లోనే ఎక్కువగా పోషకలు లభిస్తాయి. ఈ చలికాలంలో తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. తాటి బెల్లాన్ని... తాటి చెట్ల నుంచి వచ్చే రసం తో దీన్ని తయారు చేస్తారు. శీతాకాలంలో ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. తాటి బెల్లం తింటే శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరిగి... రోగులతో పోరాడే శక్తి లభిస్తుంది. శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా మితంగా ఈ తాటి బెల్లాన్ని తినవచ్చు. ఈ బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. వెయిట్ లాస్ ఉన్నవారు తిన్నా... బరువు అదుపులో ఉంటుంది.
తాటి బెల్లం తినడం వల్ల కాలేయం కూడా శుభ్రపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు, మలినాలను బయటకు పంపుతుంది. మీరు తినే ఆహారం రుచిని కూడా పెంచుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. తరచూ తింటే తలనొప్పి, మైగ్రైన్ కూడా అదుపులోకి వస్తుంది. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పీరియడ్స్ లో వచ్చే నొప్పులు సైతం కంట్రోల్ అవుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ తింటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి తాటి బెల్లాన్ని డైలీ తినటం ఆరోగ్యానికి మంచిది. డయాబెటిస్ పేషెంట్స్ ఈ తాటి బెల్లాన్ని తినవచ్చు.