లివర్ ఆరోగ్యంగా పని చేస్తేనే.. శరీరం మొత్తం ఆరోగ్యం గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపించడంలో కాలేయం ఎంతో చక్కగా పనిచేస్తుంది. లివర్ సరిగ్గా పని చేయకపోతే.. ఇతర శరీర భాగాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఫ్యాటి లివర్ తో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో లివర్ ఫెయిల్ అయి చాలామంది చనిపోతున్నారు. లివర్ ఫెయిల్ అవ్వటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఒక కారణం. కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల లివర్ పనితీరు తగ్గి..

ఒకేసారి ప్రాణాల మీదకు వస్తుంది. అయితే ఈ సమస్య ఎక్కువగా యువతలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. లివర్ ఆరోగ్యంగా పనిచేసేందుకు కూడా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. లివర్ ఫెయిల్ అయ్యే ముందు కొన్ని లక్షణాలను కనిపిస్తాయి. వాటితో మనం జాగ్రత్త పడొచ్చు. పాదాలు, కాళ్లు, చేతులు కూడా ఉబ్బినట్లు అనిపిస్తాయి. ఎన్ని రోజులు అయినా తగ్గకుండా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. జంక్ ఫుడ్ తినటం, ఆల్కహాల్, ధూమపానం, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక రకాల వల్ల ఫ్యాటి లివర్కు దారి తీస్తుందని పలు ఆధ్యయనాలు చెబుతున్నాయి.

 కడుపులో లివర్ ఉన్నచోట చర్మ పైకి ఉబ్బుతుంది. దీన్ని నొక్కితే నొప్పిగా ఉంది. ఇది కూడా ఒక లక్షణంగా చెప్పొచ్చు. అదేవిధంగా కడుపులో నొప్పి రావడం, గ్యాస్, అసిడిటీ ఎక్కువగా ఉండటం, ఆకలి అసలు వెయ్యకపోవటం, వాంతులుగా ఉండటం, వికారంగా ఉన్న ఫ్యాటి లివర్ సమస్య ఉన్నట్లే. అలాగే పని చెయ్యకపోయినా ఊరికే అలసిపోవటం, చికాకుగా ఉండటం కూడా లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ పని చేయలేక పోవటం, శరీరం నిస్సత్తువగా మారటం, నిద్ర సరిగ్గా లేకపోవడం, పొట్ట ఉబ్బరం, కారణం లేకుండా చర్మంపై దురద, దద్దుర్లు రావటం కూడా ఫ్యాటి లివర్ కు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇలాగే దీర్ఘకాలికము ఉంటే క్యాన్సర్ గా మారి లివర్ ఫెయిల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: