ప్రపంచంలో అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకం .. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ఇద్ద‌రు కాదు ఒక్కరూ.. వీరి బంధం ప్రేమ విశ్వాసం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. ఇక వీరి బంధంలో అబద్ధాలకు, మోసానికి చోటు ఉండదు. ఇద్ద‌రు తమ విషయాలను ఒకరికి ఒకరు పంచుకోవాలి. ఇద్దరి మధ్య రహస్యాలు లేకుండా జీవించాలి. అయితే భార్యాభర్తలు వారి జీవితంలో ఇద్దరి మధ్య కొన్ని విషయాలు దాస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి .. భార్యలు తమ భ‌ర్త‌తో ఎన్నో విషయాలను పంచుకున్నప్పటికీ పంచుకొని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయని తెలుస్తుంది. ఇక దీని వెనుక కొన్ని సరైన కారణాలు ఉన్నాయి .. కాబట్టి భార్యలు తమ భర్తలతో కూడా పంచుకోలేని విషయాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ఎందుకు దాచిపెడతారు: తన భర్తను కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక కొంతమంది మహిళలు కొన్ని విషయాలను దాచిపెడతారు .. ఇంట్లో వారికి ఇబ్బంది కలగకూడదనే తమ సమస్యలను ఆమె దాచిపెడుతుంది .. ప్రధానంగా వారికి తగిలిన గాయాలు, జననేంద్రియాలలో ఏమైనా సమస్యలు, ఒత్తిడి లేదా డిప్రెషన్ తో పోరాటం, మానసిక సమస్యలు వంటివి తమ భర్తతో పంచుకోవడానికి వారు ఆలోచిస్తారు. ఇలా చాలామంది భార్యలు ఈ విషయాలు భర్త దగ్గర దాచి పెడుతూ ఉంటారు.


చిన్న పొదుపు: ఇంట్లో మహిళలు తరచుగా చిన్న చిన్న పొదుపుల గురించి కొంత డబ్బును దాచిపెడతారు .. ప్రతినెలా చేసే ఈ పొదుపు గురించి ఆమె తన భర్తకు చెప్పదు .. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని వారు నమ్ముతారు .. అలాగే కుటుంబాన్ని కాపాడేందుకే మహిళలు ఇలా పొదుపు చేస్తూ ఉంటారు. ఈ విషయాలు కూడా భర్త దగ్గర దాస్తారు. లైంగిక కోరికలు : అలాగే మహిళలు తమ లైంగిక ఇష్టయిష్టాల గురించి తమ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడానికి అసలు ఇష్టపడరు .. పురుషులు మాధురిగానే మహిళలకు కూడా లైంగిక ఫాంటసీలు ఉంటాయి , కానీ వారు దాని గురించి వారి భర్తలతో మాట్లాడటాన్ని దాచి ఉంచుతారు. అలాగే అలాంటి విషయాలు చెబితే తన భర్త ఏమంటారో అన్న భయం వారికి ఉంటుంది. ఆమె సాధారణంగా తన భర్త ఇష్టయిష్టాలనే తన ఇష్టాలుగా చెబుతుంది.


ఈరోజుల్లో పెళ్లికి ముందు జరిగే సంభాషణలో భార్యాభర్తలు ఇద్దరు గతం గురించి ఓపన్గా మాట్లాడుకుంటున్నారు .. కానీ కొన్నిసార్లు మహిళలు తమ పాత బంధాల గురించి అసలు ఎక్కడా చెప్పుకోరు .. అలాగే ఇలాంటి విషయాలు తెలిస్తే భవిష్యత్తులో భర్త నుంచి సమస్యలు వస్తాయేమో అనే భయం .. అందుకే భర్త తన బంధాల గురించి చెప్పిన ఆడవారు మాత్రం చెప్పరు. ఇక స్త్రీలు తమ పుట్టింటి సమస్యలు డబ్బు విషయాలు వంటివి భర్తతో పంచుకోవడానికి సంకోచిస్తారు .. ఇక వాటిని భర్త తరపు బంధువులు తక్కువ చేసి మాట్లాడుతారేమో అని ఆమె ఆలోచిస్తుంది. భార్యకు తన భర్త బంధువులతో కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తన భర్తతో తన గురించి ప్రతికూల ఆలోచనలు చేస్తాడని భావించి ఆమె తన భర్తకు పుట్టింటి విషయాలు చెప్పదు. అలాగే పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను కూడా ఆమె దాచి పెడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: