విద్యార్థుల నుంచి రైతులు , సామాన్య ప్రజలు , ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే వారికి దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే .. అయితే దూరం వెళ్లాల్సిన పని లేకుండా కేవలం ఇంట్లో ఉండే కేవలం మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా పలు దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవచ్చు? ఎలాంటి సేవలు పొందవచ్చు? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
 

సిటిజెన్ లాగిన్ ఐడి: గతంలో మీసేవ ఆపరేటర్లకు మాత్రమే లాగిన్ ఐడీలు ఉండేవి .. అంటే ఆ సెంటర్ల నిర్వహకులకు మాత్రమే ఆ సేవలు అందించే అవకాశం ఉండేది .. అయితే ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదు .. మీసేవ ద్వారా కావలసిన పనులు చేసుకునేందుకు అందరికీ అవకాశం కల్పించారు .. అదే సిటిజెన్ లాగిన్ .. ఈ లాగిన్ ఐడి ద్వారా చాలావరకు పనులు మన ఇంటి నుంచి మనం పొందవచ్చు. ఐడి ఎలా పొందాలో  ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా తెలంగాణ మీ సేవ అధికారక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. https://meeseva.telangana.gov.in/meeseva/home.htm

హోమ్ పేజీలో కుడివైపున కనిపించే Login కాలమ్లో New User ఆప్షన్పై క్లిక్ చేయాలి.

అప్పుడు మీకు స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ ఫారమ్ కనిపిస్తుంది. అందులో మొబైల్ నెంబర్, పాస్వర్డ్, పేరు, ఈమెయిల్, అడ్రస్ సహా తదితర వివరాలు ఎంటర్ చేసి Submit ఆప్షన్పై క్లిక్ చేయాలి.

అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి Submit చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ లాగిన్ వివరాలు సేవ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ లాగిన్ ఐడీ ఉపయోగించి మీకు కావాల్సిన సేవలు పొందాలి.


ఎలా లాగిన్ కావాలంటే:

ముందుగా తెలంగాణ మీ సేవ అధికారక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
https://meeseva.telangana.gov.in/meeseva/home.htm

హోమ్ పేజీలో కుడివైపున కనిపించే Login కాలమ్లో రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్, క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి Login ఆప్షన్పై క్లిక్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.

దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్ మీద పలు రకాల సేవలు కనిపిస్తాయి.

అందులో మీకు కావాల్సిన సేవలు మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

లాగిన్ ఐడీ పొందిన తర్వాత లభించే సేవలు:

TSRTA

రెవెన్యూ

జీహెచ్ఎంసీ

సీడీఎంఏ

టీజీఎస్పీడీసీఎల్

గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సేవలు

పోలీసు శాఖకు సంబంధించిన సేవలు

విద్యకు సంబంధించిన సేవలు సహా పలు ఇతర సేవలు కూడా లభిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: