ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన షుగర్ పేషంట్లలో జలుబు, దగ్గు, జ్వరం, వివిధ ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశం మిగతా వారి కంటే ఎక్కువగా ఉంటుంది. పైగా త్వరగా తగ్గవు. అందుకే మీ శరీరానికి పడని వాతావరణం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు నిపుణులు. అందుకోసం వెచ్చటి దుస్తులు, చెవులను కవర్ చేసేలా ఉన్ని క్యాపులు, మఫ్లర్లు వంటివి ధరించడం చేయాలి. అలాగే మందులు క్రమం తప్పకుండా వాడాలి. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ వ్యాయామాలు మాత్రం ఆపకూడదు. బయటకు వెళ్లకపోయినా ఇంట్లోనే ఉండి చేయాల్సిన వర్కౌట్స్ను ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల షుగర్ పేషంట్లలో రోగ నిరోధక శక్తి పెరిగి, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. షుగర్ బాధితులు వింటర్లో హెల్తీ డైట్ మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం. తాజా కూరగాయలు, ఫైబర్ ఉండే పండ్లు రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. అలాగే వెజిటేబుల్ సూప్‌లు, సీడ్స్, నట్స్ వంటివి తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక జలుబు, జ్వరం వంటివి వచ్చే రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా కొనసాగితే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది:కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించాలి. అలాగే రెగ్యులర్గా రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవటం, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవటం, చల్లటి వెదర్ ఉన్నప్పటికీ శరీరానికి సరిపడా నీళ్లు తాగడం, ఒత్తిడి, ఆందోళనలు వంటివి పరిస్థితులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.