తలకింద ఎత్తైన దిండు పెట్టుకోవటం వల్ల వెన్నుముక, అలాగే దానికి అతుక్కుని ఉండే మెడ భాగంలో సహజమైన భంగిమకు ఆటంకం కలుగుతుంది. పైగా మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నిద్ర నాణ్యత పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెడ, వెన్నునొప్పి తరచుగా రావడం, తిమ్మిరి పట్టడం వంటి సమస్యలు మీలో ఎలాంటి అనారోగ్యాలు లేకపోయినప్పటికీ వస్తున్నాయంటే.. రాత్రిపూట తలకింద దిండు లేకుండా నిద్రపోయి. చూడండి దీనివల్ల మెడ నొప్పి తగ్గిపోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా తెల్లవారు జామున, ఉదయం పూట తలనొప్పి వస్తుందంటే.. తల కింద వేసుకునే దిండు వల్ల కూడా కావచ్చు. ఇది సరిగ్గా లేనప్పుడు, ముఖ్యంగా ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు మెడ కండరాలపై ప్రభావం చూపుతుంది.
ఈ సందర్భంగా రక్తప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలిగి తలనొప్పికి దారితీస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. కాబట్టి తల దిండు లేకుండా పడుకుంటే తల, మెడ భంగిమలు సక్రమంగా ఉంటాయి. తలనొప్పి, మైగ్రేన్ వంటివి రాకుండా ఉంటాయి. కొందరిలో దిండుపై పడుకునే తీరును బట్టి అది చర్మంపై ఒత్తిడికి కారణం కావచ్చు. ముఖానికి రాసుకుపోవడం వల్ల మొటిమలు, దద్దుర్లు వంటివి వస్తాయి. దిండుపై ముఖం అనిచి పడుకునే అలవాటు రక్త ప్రసరణకు ఆటంకం కలిగించడం వల్ల ముఖంపై ముడతలకు, వృద్ధాప్య ఛాయాలకు దారి తీయవచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి దిండు లేకుండా పడుకుంటే ఈ సమస్యలేవీ ఉండవు. గురక సమస్య ఉన్నవారు తలకింద దిండు పెట్టుకొని పడుకోవటం వల్ల మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేడం నరాలు, వెన్నుముక మధ్య కనెక్షన్ ను దిండు ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గురక సమస్య ఉన్నవారు ముఖం దిండుకు సగం అనిచి పడుకుంటూ ఉంటారు.