అలా గుర్తించదగ్గ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫ్యాటి లివర్ సమస్య ఉన్నవారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఒకటి లివర్ సైజ్ పెరగడం. అంటే నీ శరీరంలో కాలేయం ఉన్న భాగంలో ఉబ్బెత్తుగా ఉంటుంది. దానిని ప్రెస్ చేస్తే నొప్పిగా అనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హెపాటోమెగాలిగా అంటారు. కాబట్టి మీలో ఇలాంటి ఇబ్బంది కనిపించినా, కడుపు భాగంలో ఓ వైపున తరచుగా ఉబ్బినట్లు అనిపించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించారు. నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. కాలేయంలో కొవ్వు పేరుకుపోయిన వారిలో కనిపించే మరో సింప్టమ్ పాదాల్లో వాపు, కొందరికి కాళ్లు, చేతులు ఉబ్బుతుంటాయి.
కొంత కాలంగా ఈ సమస్య కనిపిస్తే గనుక మీరు ఫ్యాటి లివర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు అనుమానించాల్సిందే. అలాగే అజీర్తి, సికారం వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. ఆహారం తిన్నప్పటికీ వెంటనే వాంతికి వచ్చినట్లు అనిపించడం, ఒక్కోసారి వాంతింగ్స్ అవటం ఫ్యాటి లివర్ లక్షణాలే. అలాగే శారీరక బలహీనత, ఉదయాన్నే ఏ పని చెయ్యకపోయినా అలకటక అనిపించడం ఎక్కువ రోజులు కనిపిస్తే మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఉండవచ్చు. లివర్ దెబ్బ తిన్నప్పుడు లేదా దాని చుట్టూ ఫ్యాటి పేరుకుపోయినప్పుడు కొందరిలో చర్మంపై దద్దుర్లు, దురద వంటివి తరచుగా వస్తుంటాయి. దీనిని బట్టి ముందుగానే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం!డాక్టర్ల సలహాలు పాటించడం చేస్తే ఫ్యాటి లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు.