ప్రేమ, పెళ్లి, స్నేహం వంటి బంధాలన్నీ కప్పుడు కేవలం ప్రత్యక్ష పరిచయాలు ద్వారానే ఏర్పడేవి. కానీ ఆధునిక సంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారుతున్న ఇవాల్టి రోజుల్లో యువత ఆలోచనల్లో, ప్రవర్తనల్లో భిన్నమైన మార్పులు సంతరించుకుంటున్నాయి. సరికొత్త ధోరణులు పుట్టుకోస్తున్నాయి. బాగా ఇవి కొన్ని విషయాల్లో మేలు చేస్తున్నప్పటికీ, మరి కొన్నిసార్లు కీడు చేస్తున్నవికాను ఉంటున్నాయి. అలాంటి వాటిలో డేటింగ్ యాడ్ లేదా ఆన్ లైన్ డేటింగ్ సైట్లు' కూడా ఒకటి.

వీటిని  వీక్షించే ధోరణి రిలేషన్ షిప్ విషయంలో మేలు చేస్తున్నప్పటికీ, అదిగా యూస్ చెయడమనేది వ్యసనం గాను మారుతోందని నిపుణులు చెబుతున్నారు. లవ్, రొమాన్స్, రిలేషన్ షిప్ వంటి బంధాలకు ఇప్పుడు డేటింగ్ యాప్ లు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఎలాంటి ముఖ పరిచయం లేకపోయినా, ఎన్నడూ ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా కొన్ని బంధాలు అల్లుకుపోతున్నాయి. అదే క్రమంలో సమస్యలకు, వ్యసనాలకు కూడా దారి తీస్తున్నాయి. డేటింగ్ యాప్ లు లేదా సైట్ల వినియోగమే ఎందుకు కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వీటి ద్వారా సంబంధాలు సెట్ అవ్వటం సంగతి పక్కన పెడితే,

తరచుగా స్క్రోల్ చేయడం, వాటిలోని ప్రో ఫైల్స్ చూడకుండా ఉండలేకపోవటం అనేక మందిలో ఓ మానసిక రుగ్మతకు దారితీస్తోంది. ఎందుకంటే ఎలాంటి మ్యాచ్ సెట్ కాకపోయినా ఏదో ఒక రోజు సెట్ అవుతుందని తరచుగా అందులో చాలామంది. దీంతోపాటు ఇక్కడ టెంపరరీ రిలేషన్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉన్న ఉన్నందున వాటిని స్క్రోన్ చేయకుండా ఉండలేని పరిస్థితిలో కూరుకుపోతోంది ఈ తరం యువత. ఈ బలహీనమే డేటింగ్ యాప్ అడిక్షన్ గా పేర్కొంటున్నారు నిపుణులు. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజుల్లో ఏదన్నా చిన్న విషయం జరిగితే చాలు పెద్దగా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: