అసలే చలికాలం.. ఉదయం పూట వెదర్ చాలా కూల్ గా ఉంటుంది. ఓ వైపు మంచు కురవడం, మరోవైపు చల్లటి గాలులు గీయటం వల్ల ఈ సీజన్ లో కొంతమంది బయటకు వెళ్లకపోయినా పర్లేదు. కానీ ఎండ వచ్చిన తర్వాత కూడా పలువురు బయటకు వెళ్లలేక పోవటంతో సూర్యరశ్మికి గురైజే అవకాశాన్ని కోల్పోతారు. ఇక ఉద్యోగాలు చేసేవారిలో కూడా చాలామంది ఇంటి నుంచి వెళ్ళాక ఆఫీస్ పనిలో నిమగ్నమైపోతారు దీంతో వీరు కూడా బయట ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితులు ఉండావు. అయితే చలికాలంలో బయట తిరువలేని ఈ విధమైన జీవనశైలితో పలు సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అవేంటో చూద్దాం. చలికాలంలో బయట పరిసరాల్లో సమయాన్ని స్పెండ్ చెయ్యకపోవటం, ఎక్కువ రోజులు సూర్యరాశ్మి తగలకుండా ఉండటం అనేది మానసిక స్థితిలో మార్పులకు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. పైగా దీనివల్ల మూడ్ స్టెబిలైజర్ లో ముఖ్యపాత్ర పోషించే సెరోటోనిన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. నిజానికి ఇదొక న్యూరో ట్రాన్స్ మీటర్. ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఎక్కువ రోజులు బయట తిరగటం మానేస్తే లో ఇది ఉత్పత్తి కావటం తగ్గిపోతుంది. దీంతో మానసిక ఆందోళన, వివిధ రుగ్మతలు, శారీరక అనార్భావిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యాయనంలోనూ ఇదే వెళ్లడైంది.

 సహజ సిద్ధమైన ప్రకృతిని ఆస్వాదించడం, సూర్యకాంతికి గురికావటం, ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం, బయటి పరిసరాలో టైమ్ స్పెండ్ చేయడం అనేది మన సిర్కాడియన్ రిథమ్ కు చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నేచురల్ లైటింగ్ అనేది మనిషిలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. సహజంగా ఇది నిద్ర వేలకు ముందు పెరుగుతుంది. మేల్కొన్న తర్వాత పడిపోతుంది. కాబట్టి పగటిపూట బయటకు వెళ్లక పోతే ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: