ఉసిరిలో విటమిన్స్, ఖనిజాలు, ఆమైనో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఉన్నాయి. ఇది తలలో రక్త ప్రసరణని పెంచుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా, నల్లగా మారి బలంగా పెరుగుతుంది. అలాగే, పెరుగు కూడా జుట్టుకి చాలా మంచిది. ఇంకా పెరుగుతో ఉసిరి కలిపి వేసుకునే హెయిర్ ప్యాక్స్ వివిధ జుట్టు సమస్యలను పోగొట్టి వెంట్రుకలకు బలాన్ని, మెరుపును ఇస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. జుట్టు మందంగా, పొడవుగా ఉండాలంటే ప్రత్యేక పోషణ అవసరం.

పెరుగు మీ జుట్టుకు పూర్తి పోషణను అందిస్తుంది. పెరుగును ఉసిరి పొడిని కలిపి జుట్టుకు కట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ఉసిరి పొడి పెరుగు హెయిర్ ప్యాక్ జుట్టు రాలటం సమస్యను దూరం చేస్తుంది. జుట్టు సమస్యలను దూరం చేయటంలో ఉసిరి అద్భుత వరం అంటున్నారు నిపుణులు. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉసిరి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉసిరితో తల వెంట్రుకలు ఒత్తుగా, బలంగా పెరుగుతాయి. అలాగే ఇది మీ జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

ఉసిరిని జుట్టుకు ఉపయోగించడం వల్ల అనటం తగ్గటం నుంచి చుండ్రు పూర్తిగా తొలగిపోవటం వరకు ఉసిరి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఉసిరి పొడిని పెరుగుతో కలిపి ప్యాక్ లా వాడితే, క్రమంగా మీ జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. దీనివల్ల డాండ్రఫ్ దూరమై జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. ఇందుకోసం ఉసిరిపొడి, పెరుగు హెయిర్ ప్యాక్ కోసం 2 స్కూల్లో ఉసిరి పొడిని తీసుకుని, దానికి 3 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. జుట్టు, తలపై ఈ హెయిర్ మాస్క్ ను పూర్తిగా అప్లై చేయండి. ఒక గంట తర్వాత షాంపుతో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. చుండ్రు సమస్య దూరం అవుతుంది. పెరుగును ఉసిరి పొడిని కలిపి జుట్టుకు కట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: