కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. ఇవి చలికాలంలో అధికంగా లభ్యమవుతాయి. పైగా ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. అయితే చాలామంది దీని రుచి కారణంగా తినేందుకు ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే పోషకాలు క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఎన్నో వ్యాధులను తరిమి కొడతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఈ కూరగాయలను కూడా తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

 చలికాలంలో వచ్చే సీజనల్ కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. కొంతమందికి క్యాబేజీ ఇష్టం ఉండదు:దీని వాసన, రుచి కారణంగా దూరం పెడుతుంటారు. కానీ క్యాబేజీని కూడా అన్ని కూరగాయలతో కలిపి తినాలని చెబుతారు నిపుణులు. క్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా తింటారు. క్యాబేజీలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. క్యాబేజీ మధుమేహం, థైరాయిడ్ సమస్యలతో కూడా సమర్థమంతంగా పోరాడుతుంది. క్యాబేజీని తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజీలో ఎక్కువ మొత్తంలో మీరు, తక్కువ క్యాలరీలో ఉంటాయి. ఇది రోజంతా మనకు కావాల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది.

 బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది మంచి ఎంపిక. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కె, సి కూడా అధికంగా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రాణాంతకమైన గుండె సమస్యలు, క్యాన్సర్ నుండి మనలను రక్షిస్తుంది. క్యాబేజీలో యాంటీ హైపర్లై సిమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. డయాబెటిక్ నెప్రోపతి నుండి రక్షిస్తుంది. క్యాబేజీలో గ్లూకోసినోలేట్, సల్ఫర్ ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. కొంతమందికి క్యాబేజీ ఇష్టం ఉండదు:దీని వాసన, రుచి కారణంగా దూరం పెడుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: