ఈరోజుల్లో ఒక పూట తినకుండానైనా ఉండగలుగుతారేమో కానీ.. ఫోన్ చూడకుండా మాత్రం ఒక గంట కూడా ఉండలేరు చాలామంది. గాలి, నీరు, ఆహారం లెక్కనే జీవితంలో అదో భాగమైపోయింది. నిజానికి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే కాదు, మన ఆలోచనలు, అవసరాలు కూడా మారిపోతున్నాయని నిపుణులు చెబుతుంటారు. ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అనేది స్మార్ట్ ఫోన్ రూపంలో అరచేతిలో ఇమిడిపోవడం అనేక విధాలుగా మేలు చేస్తున్నప్పటికీ అప్రమత్తంగా లేకపోతే కీడు కూడా చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. రాత్రిళ్లు లైట్లు ఆర్పేసి ఫోన్ చూసే అలవాటు కూడా అలాంటిదే.

దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇటీవల పిల్లలు, పెద్దల్లో కూడా రాత్రిపూట లైట్లు ఆర్పేసి చీకట్లో ఫోన్ చూసే అలవాటు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో నిమగ్నమైపోవడం, రీల్స్ స్క్రోల్ చేస్తూ, ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తూ ఉండిపోవటం చివరికి నిద్రలేమికి, మానసిక, శారీరక ఆరోగ్యాలకు దారితీస్తున్నట్లు అధ్యాయనాలు కూడా పేర్కొంటున్నాయి. ఈరోజుల్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఈజీ కావటంతో కొందరు రాత్రింబవళ్లు కూడా ఫోన్లకు అతుక్కుపోయేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. కాగా రాత్రిపూట చీకట్లో గంటల తరబడి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను చూడటమనేది పిల్లలు, పెద్దల ఆరోగ్యం పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.

చీకట్లో ఫోన్ చూడటం అలవాటుగా మారితే అది మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. గంటల తరబడి స్క్రోల్ చెయ్యటం బ్రెయిన్ కణాలను ప్రేరేపిస్తుందని, ఇది నరాల బలహీనతకు, నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గుతాయి. గంటల తరబడి చీకట్లో ఫోన్ చూడటం వల్ల దాని నుండి వెలువడే కాంతికి కళ్ళలోని రెటీనా దెబ్బతింటుంది. కాబట్టి పడుకునే ముందు గదిలో లైట్లని ఆర్పేసి ఫోన్ చూడటం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అందుకు బదులు కాసేపు ఆరు బయట వాకింగ్ చేయడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడడం లేదా పుస్తకం చదవడం వంటివి చేస్తే చక్కగా నిద్ర పడుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: