అందుకే చాలామంది జరిగేదేదో జరిగింది. గతమంతా ఏదోలా గడిచింది. ఈ కొత్త సంవత్సరం నుంచైనా సంతోషంగా ఉండాలని భావించేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారికోసం నిపుణులు సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు పుట్టి పెరిగిన వాతావరణం, చుట్టూ పక్కల సామాజిక పరిస్థితులు, అపదలు, ఆటంకాలు, సంతోషాలు, సరదాలు ఇలా ప్రతి అనుభవం మీకు ఏదో ఒక నేర్పే ఉంటుంది. అవన్నీ మీలో కొన్ని ఆలోచనలు స్థిరపడేలా, వ్యక్తిత్వం రూపు దిద్దుకునేలా కూడా సహాయపడి ఉండవచ్చు. అయితే అవన్నీ మీకు మేలు చేసేవి అయినప్పుడు సమస్యలు ఏమి ఉండవు. కానీ కొన్ని ఆలోచనలు కాలంతో పాటు మిమ్మల్ని మారనివ్వకుండా వెంటాడుతుంటాయి. మరి కొన్ని మీ అభివృద్ధికి ఆటంకంగా మారవచ్చు. అలాంటి వాటిలో ఓవర్ థింకింగ్ ఒకటి.
ప్రస్తుతం ఈ అతి ఆలోచన ధోరణే చాలామంది యువతి యువకులకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చదువు, ఉద్యోగం, జీవితం, రోజువారి కార్యకలాపాలు ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడు, పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. ఈ క్రమంలో నెగిటివ్ ను ఎక్కువగా స్వీకరించడం, ఆలోచించడం వల్ల కలిగే ప్రతికూల ధోరణుల్లో ఓవర్ థింకింగ్ కూడా ఒకటి. ఇది నీలో నిరాశ నిస్పృహ, ఆందోళన, పొత్తిడికి కారణం అవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సెక్సెస్ అందించడానికి ఆటంకం గా మారుతుంది. కొత్త సంవత్సరంలో మీరు ఇలాంటి అడ్డంకులేవీ ఉండకూడదనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సింది అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే... ఓవర్ థింకింగ్ వదిలేయండి.