ఈరోజుల్లో చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా బిర్యాని తినటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బయట ఫుడ్ కే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. మీల్ మేకర్ తో స్నాక్స్, కర్రీలు, రైస్ ఐడేమ్స్ చాలా రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. మీల్ మేకర్ తో ఏం చేసినా రుచ్చగానే ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ చలికాలంలో వేడివేడిగా ఏదైనా వెరైటీగా తినాలని పిల్లలు అండే ఆలోచించకుండా ఒక్కసారి ఇలా మెయిల్ మేకర్తో బిర్యానీ చేయండి. మీల్ మేకర్ గురించి అందరికీ తెలుసు. మీల్ మేకర్లు అనేక రకాల పోషకాలు లభిస్తాయి.

 ప్రోటీన్, ఫైబర్ కావాలి అనుకునే వారికి మెయిల్ మేకర్ బెస్ట్. కూట లైట్ గా తినాలని అనుకుంటే ఈ బిర్యాని తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ గా చాలా త్వరగా అయిపోతుంది. మరి ఈ మెయిల్ మేకర్ తో బిర్యాని ఎలా తయారు చేస్తారు. ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వేడి నీటిలో మిల్ మేకర్ వేసి ఓ పది నిమిషాలు ఉంచి మెత్తగా అయ్యాక.. నీరంతా పిండి నువ్వు గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మీరు మేకర్ ని మ్యారినేట్ చెయ్యాలి. పచ్చిమిర్చి, పులావ్ దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా,

నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నూనె వేసి అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరోవైపు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఖాళీగా ఉండే ఓ గిన్నె తీసుకుని అందులో నీళ్లు, పచ్చిమిర్చి, పులావ్ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి... 80 శాతం ఉడికాక తీసి మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్ పై వేయండి. ఆ తర్వాత పైనుంచి కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యవే వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఓ 15 నిమిషాలు కుక్ చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే మిల్ మేకర్ దమ్ బిర్యానీ సిద్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి: