ఆరోగ్యాన్ని ఇచ్చే దుంపల్లో ముల్లంగి ఒకటి. ఇది శరీరానికి సహజమైన డీటాక్స్ గా పని చేస్తుంది. అదే సమయంలో... దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో ఎక్కువగా దొరికే కూరగాయల్లో ఒకటైన ముల్లంగితో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు.  అలాంటి ఆహారంలో ఒకటి ముల్లంగి పరాటా. దీనిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో రకరకాల ఆహారం తినాలని కోరుకుంటారు. ముఖ్యంగా టీ తో పాటు వేడి వేడి పకోడీ, బజ్జీలు, చపాతి, పరాటాలను తినాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఈ సీజన్లో పరాటాలను తినడానికి ఇష్టపడతారు.

 శీతాకాలంలో ముల్లంగి తక్కువ తరిగే దొరుకుతుంది... ఈ నేపథ్యంలో ఈ సీజన్లో దొరికే ముల్లంగితో చేసే పరాటాలను తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ముఖ్యంగా చలికాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యం అన్ని డైటిషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. దీని ఎక్కువ మొత్తంలో విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుందని అన్నారు. ముల్లంగి పరాటాలను జీర్ణం చేసుకోవడం అందరికీ అంత సులభం కాదు. ముఖ్యంగా ఎవరికైనా జీర్ణవ్యవస్థ సెన్సిటివ్ గా ఉంటే ముల్లంగి పరాటాలు తినవద్దు.

ముల్లంగి పరాటాలను తినటం వల్ల జీర్ణవ్యవస్థపై పొత్తిడి పెరుగుతుంది. అపానవాయువు, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేసే ముల్లంగిలో గోయిట్రోజెన్ అనే మూలకాలు కనిపిస్తాయి. హైపోథైరాయిడిజం రోగులు ముల్లంగిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇక చెప్పాలంటే ముల్లంగి పరాటాలను తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. గర్భిణీ స్త్రీలు ముల్లంగి పరాటాను తినే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: