పొగతాగటం వల్ల  ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పొగ తాగటం వల్ల ఒక ఊపిరితిత్తులనే కాదు, శరీరంలోని చాలా బాగాలను దెబ్బతీస్తుంది. స్మోకింగ్ ఎక్కువగా చేయటం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్క సిగరెట్ తాగటం వల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతారని ఓ అధ్యాయనం అంచనా వేసింది. కాబట్టి సిగరెట్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు దీనిపై అధ్యాయనం చేశారు.

ధూమపానం వల్ల ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతారని పరిశోధకులు పేర్కొన్నారు. జీవితం చివర్లో కంటే ఆరోగ్యం అంతమైన మధ్య వయసును హరిస్తుందని వివరించారు. మూవీ స్టార్ట్ అయ్యే ముందు కూడా ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే యాడ్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ యాడ్ చూసినవాళ్లు అయినా కానీ సిగరెట్ ని కాల్చడం మానడం లేదు. సిగరెట్ ఎక్కువగా తాగటం వల్ల రకరకాల జబ్బులు దరిచేరుతాయి. ఒక్క సిగరెట్ తాగటం వల్ల మీ జీవితమే నష్టపోతుంది. సిగరెట్ తాగటం వల్ల మనతో పాటు మన కుటుంబ సభ్యులకి కూడా నష్టం జరుగుతుంది.

సిగరెట్ ఎక్కువగా తాగటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సిగరెట్ తాగటమే కాకుండా ఆ పొగానీ పిల్లలు కానీ పెద్దవాళ్లు కానీ పీల్చడం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. హై బీపీ లేదా అన్ కంట్రోల్ లో ఉండటానికి కూడా సిగరెట్టే ఒక ప్రధాన కారణం. ఇందులో ఉండే నికోటిన్ రక్తనాళాల ఒక ఎలెక్ట్రాసిటీని తగ్గించేస్తుంది. సిగరెట్ ఎక్కువగా తాగటం వల్ల హాట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈరోజుల్లో చిన్నపిల్లలు కూడా సిగరెట్ ని ఎక్కువగా కాల్చుతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసు లోనే సిగరెట్ ని కాల్చడం మొదలు పెడితే ఇక పెద్దయ్యాక వారి జీవితం ఏమవుతుందో తెలుసా? జీవితమే లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: