గాలికిక ఏమవుతుంది... మళ్లీ వాటి బిల్లులు కట్టడానికి వెళ్లాను వెళ్లానూ గోకుడు షురువవుతుంది. సో.. ఏంటి ఇబ్బంది అయినా... ఎన్ని సమస్యలు ఎదుర్కొచ్చిన ఈ జీవితపు పరుగులను ఆపలేం. ఆపేస్తే... ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. వరుణ్ హసిజా వయసు 30 సంవత్సరాలు. బెంగళూరులోని ఒక ఎమ్ఎంఎన్సీ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగం. ఏడాదికి రూ. కోటి ప్యాకేజీ. 20 ఏళ్ల వయసులోనే కెరియర్ మొదలుపెట్టాడు. ఇంకేంది లైఫ్ పులూ బిందాస్ కదా..? నిజమే... చేతినిండా డబ్బు. ఏ లోటు లేకుండా సాగుతున్న జీవితం. ఇన్ని ఉన్న వరుణ్ హ్యాపీగా లేడట. విలాసమంతమైన జీవితమే అయినా... ఉద్యోగ జీవితంలో విపరీతమైన ఒత్తిడి ఫీలయ్యాడట.
టార్లెట్ ల వెంట పరుగులు పెట్టలేక నిత్యం మానసిక ఒత్తిడితో సతమతం అయ్యేవాడట. అవసరానికి మించి సంపాదిస్తున్న వరుణ్ జీవితంలో సంతృప్తి కరువైంది. మానసిక ప్రశాంతత లేక తీవ్ర ఆందోళనకు గురై ఎవరికి చెప్పలేని బాధను అనుభవిస్తున్నాడు. విలావంతమైన జీవితం కంటే సంతోషకరమైన జీవితమే ముఖ్యం అని భావించి తన భార్యతో విషయం చెప్పుకున్నాడు. తాను చేస్తున్న ఉద్యోగం వల్ల మానసికంగా ... శారీరకంగా అనుభవిస్తున్న నరకాన్ని భార్యకు వివరించి... ఉరుకు పరుగుల జీవితానికి బ్రేక్ ఇచ్చాడు. సంతోషంగా, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు. వరుణ్, అతడి భార్య ఇదే ఆలోచించారు. ఉద్యోగం మానేస్తే జీవితం ఎంత అర్భరంగా మారుతుందో వాళ్లకు తెలుసు.