నిద్రపోతున్నప్పుడు మీ ఫోన్ మీ నుండి ఎంత దూరంలో ఉండాలి? దగ్గరగా ఉంటే ఏమవుతుందో చూద్దాం. గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. పిల్లలనుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటంతో గంటల తరబడి ఉపయోగించే పరిస్థితి నెలకొంది. చాలామంది ఫోన్ వినియోగదారులు ఇంస్టాగ్రామ్ లేదా యూట్యూబ్ లో సినిమాల చూస్తూ గడుపుతున్నారు. ఇక కొంతమందికి ఫోను వృత్తిపరమైన పని కోసం ఉపయోగించటం వల్ల వారు ఫోన్ ను 24 గంటలు వాడేలా చేస్తుంది. కొంతమంది వ్యక్తులు ఫోన్ లేకుండా ఉండని పరిస్థితి ఉంది. స్మార్ట్ ఫోన్ వాడకం మీకు చాలా ప్రమాదం. కొంతమంది తమ ఫోను తల పక్కన చేతి పక్కన పెట్టుకునే నిద్రపోతారు. అయితే ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయో చాలామందికి తెలియదు. ఆరోగ్యం దృష్ట్యా స్మార్ట్ ఫోన్ చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. దీని నుంచి వెలువడే రేడియేషన్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అందుకే వీలైనంతవరకు దూరంగా ఉంచడం మంచిదంటున్నారు. ఫోను మీకు వీలైనంత దూరంగా ఉంచండి. రోజంతా ఫోన్ను చూడటం వల్ల కళ్ళపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఇది దృష్టిని బలహీన పరుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఫోన్ ల అధిక వినియోగం కూడా నిద్ర సంబంధిత సమస్యలకు ఒక కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ లను అతిగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొంతమందికి మెమరీ లాస్ కూడా ఉంటుంది. కొందరు వ్యక్తులు రాత్రుల్లో తమ ఫోన్ల దగ్గర పెట్టుకుంటారు. ఇది సరైనది కాదంటున్నారు నిపుణులు. ఫోను మీ నుండి 3 నుండి 4 అడుగుల దూరంలో ఉంచడం మంచిది. మీరు మీ ఫోన్ను దిండు కింద, చెయ్యి దగ్గర లేదా మంచం మీద ఎక్కడైనా ఉంచి నిద్రిస్తే, అది మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుందని గుర్తించండి. నిద్రపోతున్నప్పుడు ఫోన్ ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదు.