పనస పండు.. కమ్మటి బాసనతో అందరిని ఊరిస్తుంది. అయితే, పనస పండును ఇష్టంగా తినేవారు దాని గింజలను మాత్రం చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ, ఈ గింజల ఉపయోగాలు తెలిస్తే ఇకపై ఎలాంటి పొరపాటు అస్సలు చెయరండోయ్... ఎందుకంటే పనస గింజల్లో లేడు పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకరకంగా దినిని చౌక బాదం అని కూడా పిలుస్తారట. పనసలో ఫోలేట్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ అలాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పనసలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరి దీని లాభాలేమిటో ఇప్పుడు చూద్దాం. పనస గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరించడంలో సహాయపడుతుంది.

పనస గింజలలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. పనస గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. పనస గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి పనస గింజలు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పనస గింజలలోని ఫైబర్...

ఎక్కువసేపు కడుపు నిండగా ఉంచడంలో సహాయపడుతుందని తద్వారా ఇది అతిగా తినడానికి నివారించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పనస పండు గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. పనస గింజలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజాలు. పొటాషియం రక్తనాళాలను సడలించి గుండె వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. పనస గింజలలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇవి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో, గుర్తు రాలడాన్ని నివారించడంలోని మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: