అయితే కొలెస్ట్రాల్ ను మంచి, చెడు అని రెండుగా విభజిస్తారు... ఒకటి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్.. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను సృష్టించడానికి రక్తంలో మంచి కొలెస్ట్రాల్ అవసరం. అయితే చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పరిమాణం పెరిగినప్పుడు, సిరలలో పేరుకుపోవటం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. చాలాసార్లు, అధిక కొలెస్ట్రాల్ రక్తం గడ్డ కట్టడానికి కూడా దారితీస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి, మీరు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించాలి.
శరీరంలో కొన్ని నిర్దిష్ట సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తే, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోండి. కొలెస్ట్రాల్ పెరిగితే శరీరం కొన్ని హెచ్చరికల సంకేతం ఇస్తుంది.. అవేంటో చూద్దాం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల నేరుగా అధిక రక్తపోటుకు సంబంధించినది. రక్తంలో కొవ్వు ఎంత పెరిగితే రక్తపోటు అంత ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ కారణంగా రక్త సరఫరాలో అవరోధం ఏర్పడినప్పుడు. గుండెకు రక్తాన్ని పంప్ చెయ్యడానికి ధమనులు చాలా కష్టపడాలి. నీ పాదాలు మొద్దుబారడం ప్రారంభించినప్పుడు దానిని తేలికగా తీసుకోకండి... అది అధిక కొలెస్ట్రాలకు సంకేతం కావచ్చు. అయితే కొలెస్ట్రాల్ ను మంచి, చెడు అని రెండుగా విభజిస్తారు... ఒకటి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్.. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను సృష్టించడానికి రక్తంలో మంచి కొలెస్ట్రాల్ అవసరం.