ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో జీవితం అంతా ఉరుకు పరుగులు అవుతుంది. ప్రస్తుతం ఉన్న కాలం లో పెళ్లి చేసుకోవడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో సెటిల్ అయ్యామా .. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నామా ? అన్నది ముందు ప్రయారిటీ అవుతుంది. పిల్లలను పోషించడానికి మన స్థోమ‌త‌ సరిపోతుందా ? ఇలా అన్నీ తెలుసుకున్నాకే పురుషులు పెళ్లి చేసుకోవటానికి రెడీ అవుతున్నారు. దీంతో చాలామందికి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి జరుగుతోంది. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునేవారు తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలను క‌నటానికి కూడా ఎంతో సమయం తీసుకోవాల్సి ఉంటుంది.


జీవితంలో సెటిల్ కావాలని ఉద్దేశంతో అందరూ చాలా కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు. ఉద్యోగం పొందిన తర్వాత గంటల గంటలు లాప్టాప్ వద్ద కూర్చుని పని చేయాల్సి ఉంటుంది. వయసు పెరిగిపోవడంతో పాటు గంటల గంటలు కూర్చుని ... ఎలక్ట్రానిక్స్ ముందు కూర్చుని పనిచేయటం కచ్చితంగా సంతాన ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందట. దీని కారణంగా పిల్లలు పుట్టడం కూడా ఆలస్యం అవుతుంది. వయసు పెరిగే కొద్దీ మనలో సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. దీని కారణంగా శరీరం కాస్త వీక్ అవుతుంది. ఈ క్రమంలోనే పిల్లలు పుట్టడానికి అవసరమయ్యే కణాలు తగ్గుతూ ఉంటాయి.


ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోక పోవటం వల్ల లైంగిక జీవితం పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. 30 తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల లైంగిక సమస్యలు ఎక్కువవుతాయి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచన విధానం మారుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే పిల్లలు టీనేజ్ లోకి వచ్చేసరికి తల్లిదండ్రులకు 50 సంవత్సరాలు వస్తాయి. దీంతో ఆర్థిక జీవితం అతలా కుతలం అవుతుంది. ఇది వారి విద్యా ఉపాధి పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే వయసు వచ్చిన పురుషులు త్వరగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలని ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: