పాలలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాస్ పాలు తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు పాలు మేలు చేస్తాయి. కానీ, పాలు ఎక్కువగా తాగటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. మోతాదుకు మించి పాలు తాగటం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మంచి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన సంపూర్ణ ఆహారంలో పాలు అతి ముఖ్యం. ఈ విషయం మనందరికీ తెలిసిందే.

 పుష్కలమైన పోషక విలువలు నిండి ఉన్న పాలు ప్రతిరోజు తప్పక తాగాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. పాలు ఎక్కువగా తాగటం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పమంటున్నారు ఆరోగ్యానికి నిపుణులు. ముఖ్యంగా పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. తిమ్మిరి, ఉబ్బరం, అజీర్ణం, అతిసారం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, మీ శరీరం పాలకు అనుగుణంగా లేకుంటే, మీరు దీని కారణంగా పేగు సెండ్రోమ్ కు గురవుతారు. దీని కారణంగా, మీరు అన్ని ఎప్పుడు నీరసంగా, అలసటగా ఉంటారు. ఎక్కువగా తలనొప్పి సమస్య కూడా వేధించే అవకాశం ఉంది. అంతేకాదు...

పాలు ఎక్కువగా తాగటం వల్ల ముఖంపై మొటిమల సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. ముఖంపై మొటిమలు, మధ్యలో తరచూ వేధిస్తున్నట్టయితే.. మీరు రోజుకు ఎన్ని పాలు తాగుతున్నారు గమనించండి. అలాగే, పాలల్లో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. పాలను నివారించాలి. లేదా చాలా తక్కువగా తీసుకోవాలి. పాలు ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుంది. మీకు రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. తిమ్మిరి, ఉబ్బరం, అజీర్ణం, అతిసారం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: