ఇవి పచ్చ రంగులో ఉంటాయి. రుచికి మాత్రం కాస్త పుల్లగా ఉంటుంది. వీటిని ఎక్కువగా ద్రాక్ష పసిఫిక్, తూర్పు ఆపియాలోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. అనేక రకాల పోషకాలు లభిస్తాయి. విటమిన్లు సి, బి2, బి9, బి6, ఫైబర్, జింక్, ఐరన్, పొటాషియం, కాలుష్యం, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం వంటివి లభిస్తాయి. వీటిని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తాయి. మరి స్టార్ ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ ఫ్రూట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి.
ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, మలిన పదార్థాలను బయటకు పంపించడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తరచుగా స్టార్ ఫ్రూట్ తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ స్టార్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు... ఇమ్యూనిటీ పెంచడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్లు త్వరగా ఎటాక్ చెయ్యకుండా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ తింటే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ బరువును కంట్రోల్ చేసి, ఆకలిని నియంతరణ చేస్తాయి. తరచూ ఈ పండు తింటే బరువు అనేది తగ్గుతుంది.