కానీ ఇదంతా అవగాహన రహిత్యం అంటున్నారు నిపుణులు. క్లోజ్ గా ఉంటున్న మీరంటే ఇష్టం లేదా ఆసక్తి లేని వ్యక్తి ప్రవర్తనలో అందుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే కనిపిస్తుంటాయి. లవ్, ఫ్రెండ్ షిప్, రిలేషన్ షిప్, డేటింగ్ వంటి సందర్భాల్లో వీటిని గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితిలో సంబంధం కొనసాగిస్తున్న వారిని లేదా నటిస్తున్న వ్యక్తులను బాడీ లాంగ్వేజ్ ను బట్టి కూడా పసిగట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి సంకేతాల్లో వాటిలో కాంటాక్ట్ ఒకటి. అంటే అవతలి వ్యక్తితో మీరు ఎంతసేపు మాట్లాడినా మీ వైపు ఫోకస్ చేయటం కానీ, మీ కళ్ళలోకి చూడటం కానీ చెయ్యకపోతే మీరంటే ఇష్టం లేకపోవచ్చు లేదా ఆ సందర్భంలో మీతో మాట్లాడటానికి లేదా సమయం కేటాయించడానికి ఇష్టం లేకపోవచ్చు.
దీంతో మీరు మాట్లాడటం ఎప్పుడు ఆపేస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఇలాంటి బిహేవియర్ గుర్తిస్తే గనుక మీరంటే అవతలి వ్యక్తికి పెద్దగా ఆసక్తి లేదా ఇష్టం లేదని అర్థం. మీరంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు పెదవులు కొరుకుతూ ఉండటం, మీరు చెప్పేది అంత ముఖ్యమైనది కాదన్న ధోరణితో వేరే వైపు దృష్టి సాధించడం చేస్తుంటారు. ఏదైనా అడిగితే సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంటారు. అలాగే ముక్తసరిగా, చులకనగా మనం ఇవ్వటం, ప్రతి విషయాన్ని తిరస్కరించడం, కారణం లేకుండానే విమర్శించడం చేస్తుంటారు. అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వారు తమ పాదాలను, ముఖాన్ని మీ వైపునకు కాకుండా మరో దిశకు తిప్పి ఉంచడం చేస్తుంటే... నీతో మాట్లాడటానికి ఇష్టం లేకపోవచ్చు.