మరి అప్పటికప్పుడు సాంబార్ తయారు చేసుకోవాలంటే ఎలాగైనా ఓ అరగంట లేదా గంట సమయం పడుతుంది. కానీ ఈ సాంబార్ పొడిని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే... క్షణాల్లో సాంబార్ సిద్ధం. అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇడ్లీ, దోసెలకు ఆనందంగా తినొచ్చు. మరి ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి. మరి ఈ సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, బియ్యం వేసి ఒకదాని తరువాత వేడి చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్ట్స్ ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, చింతపండు, మెంతులు, నల్ల మిరియాలు, కరివేపాకు కూడా వేసి వేయించి పక్కకు తీసుకోవాలి.
ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి ఓసారి తిప్పి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ చల్లారాక మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఇవి చల్లారేక ఇందులో మిక్స్ పట్టిన పొడిని వేసి బాగా నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ప్రీ మిక్స్ సాంబార్ పొడి సిద్ధం. మీరు సాంబార్ చేయాలనుకుంటే... చింతపండు రసం తీసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మీకు నచ్చిన కూరగాయల ముక్కలు, వేసి పెట్టుకున్న పొడి వేసి ఓ 10 నిమిషాలు మరిగిస్తే చాలు... ఇడ్లీలో వేసుకునే సాంబార్ చూద్దాం.