బీరకాయలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. బీరకాయలు విటమిన్ ఏ, సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. బీరకాయంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలోని విటమిన్ బి6 ఐరన్ తో పాటు శరీరంలోని ఎర్ర రక్త కణాల సంశ్లేషణలో పాల్గొంటాయి. దీంతో రక్తహీనత దారి ఉండదు. బీరకాయలు వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలు సెల్యులోజ్, డైటర్ ఫైబర్ కూడా లభిస్తుంది. బీరకాయను తినటంతో జీర్ణ ఆరోగ్యంగా మారుతుంది. మలబద్ధకం దూరం అవుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడంలో బీరకాయ సహాయపడుతుంది.
ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. బీరకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పోషకాలు లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగ పరుస్తాయి. బీరకాయ తినటంతో చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. బీరకాయలు, పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యవంతంగా మారుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో బీరకాయ సహాయపడుతుంది. దీంతో అకస్మాత్తుగా గుండెపోటు రాదు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం యాసిడ్స్ ను తటస్తం చేస్తాయి. బీరకాయలు విటమిన్ ఏ, సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. బీరకాయంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.