అయితే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తొలగిస్తుందని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం కిడ్నీలో రాళ్లు ఎక్కువ కాలం ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని ఆ భాగంలో విషపూరిత వ్యర్ధపదార్థాలు పేరుకు పోవడం ప్రారంభించినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. ఈ కారణం గానే మూత్రశయంలో రాళ్లు వస్తుంటాయి. ఇక్కడ రాళ్లు ఉండటం ఇప్పటికే తీవ్రమైన సమస్య అయితే, దాని నుండి క్యాన్సర్ రావడం మరింత ప్రమాదకరం. ఇది క్యాన్సర్కు ఎలా కారణం అవుతుందో తెలుసుకుందాం. మూత్రంలో ఉండే ఖనిజాలు మూత్ర విసర్జన ప్రాంతంలో ఎదుర్కుపోవడం ప్రారంభించినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఇలా బ్లాడర్ లో ఉండటం వల్ల ముద్రశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆసియా ఇన్స్టిట్యాట్ ఆఫ్ నెఫ్రాలజి అండ్ యూరాలజీ రోబోటిక్స్ విభాగం వెల్లడించింది.
దీని ప్రారంభ సంకేతాలలో కొన్ని మూత్ర విసర్జన ప్రాంతంలో మంట, దురద వంటి లక్షణాలు ఉంటాయని వారు వివరించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతంలో పదేపదే దురద లేదా అసౌకర్యం కనిపించడం మూత్రశయంలో వాపు కు దారితీస్తుంది. ఇది కణాల్లో మార్పులకు కూడా దారితీస్తుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. UTI సంక్రమణ మళ్లీ మళ్లీ ప్రారంభిస్తే అది మూత్రం చేయ క్యాన్సర్ కు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఏర్పడ్డ స్టోన్స్ సమస్యను పట్టించుకోకుండా, ఎక్కువ కాలం చికిత్స చేయకపోతే అది క్రమంగా క్యాన్సర్కు కూడా కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.