మరెంతో దూరం లేదు. వారం రోజులు గడిస్తే సంక్రాంతి వచ్చేసినట్లే.. అయితే ఈ ఫెస్టివల్ అంటేనే తెలుగు ప్రజల్లో అదో ఆనందం. ఆనందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పల్లెటూర్లు, కోడిపందాలు వంటివన్నీ గుర్తుకొస్తాయి. ఇక విద్యాసంస్థకు సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల సరదా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో పతంగులు ఎగుర వేయటం పిల్లలకు, పెద్దలకు కూడా మహా సరదా.. అదో తీపిజ్ఞాపకం. అందుకే ఒక్కసారైనా ' గాలి పటమా పద పద' అంటూ చేతిలో పతంగి పట్టుకుని ఆకాశం వైపు చూడనివారంటూ ఉండరు.

ఇక్కడ ఆనందం, ఆట ఎంత ముఖ్యమో జాగ్రత్త కూడా అంతే ఇంపార్టెంట్ అని గుర్తించుకోండి. లేకపోతే గాలిపటాలు ఎగురువేసే క్రమంలో అది ఏ బిల్డింగ్ పైనో, చెట్లు మీదనో, కరెంటు తీగల్లోనే ఇరుక్కుంటే తీసే ప్రయత్నంలో ప్రమాదాలు జరగవచ్చు. చైనా మాంజా పడితే ప్రాణాలకే ప్రమాదమని పెద్దలు, నీ పనులు హెచ్చరిస్తున్నారు. అలాగే గాలిపటాలను ఎగురు వెయ్యడానికి ఎలాంటి ప్రదేశాలు సేఫ్, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకుందాం. గాలిపటం చక్కగా ఎగరాలంటే అందుకు స్థిరమైన గాలి ఉండాలి. అందుకోసం విశాలమైన మార్కులు, ఆరుబయట మైదానాలు, పోలాలు, బీచ్ లు వంటి కాళీ ప్రదేశాల్లో పతంగులను ఎగురు వేయటం మంచిది.

 దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే చెట్లు, కరెంటు స్తంభాలు, విమానాశ్రయ సమీపంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గాలిపటాలు ఎవరు వెయ్యకూడదు. జనసాల మధ్య పతంగుల ఎగుర విజయతం కూడా సురక్షితం కాదు. మరి మదునైనా దారం గానీ, చైనా మాంజా గాని వాడటం వల్ల ప్రమాదకరం. పతంగులు ఎగుర వేసేటప్పుడు చెట్లు, బిల్డింగులు, కొండలు వంటివి అడ్డుగా లేని చోటును ఎంచుకుంటే అవి పైకి ఎగరడానికి మంచి అవకాశం ఉంటుంది. పతంగులు ఎగురు వేస్తున్న క్రమంలో అనుకోకుండా విద్యుత్ స్తంభాల పైనో, వైర్ల మధ్యనో ఇరుక్కుంటే తీసే ప్రయత్నం అసలు చేయకూడదు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి, ఇలాంటి అప్పుడు పతంగులను వదిలేయడం బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: