అలోవెరా జెల్ చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అలోవెరా జెల్ జుట్టును మాయిశ్చరైజ్ చేయటంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్ జుట్టును మృదువుగా చేసి జుట్టు చిక్కులను తొలగిస్తుంది. ఇందులోనే యాంటీ ఇంఫ్లమేటరి గుణాలు కుదుళ్లకు చల్లదనం అందిస్తాయి. అలాగే కుదుళ్ల ఇన్ఫెక్షన్స్ నివారించి జుట్టు చివర్ల నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. అలోవెరా జెల్ లో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. జుట్టుకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలోవెరా లోని గుణాలు తలలో చుండ్రును తొలగిస్తాయి. అలోవెరా జెల్ నాచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది. వెంట్రుకలను వధువుగా, మెరిసేలా మారుస్తుంది. జుట్టుకు సహజమైన కాంతిని అందిస్తుంది. అరటిపండు, అలోవెరాను ఉపయోగించి కూడా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మీ జుట్టును సిల్కీ గా మారుస్తుంది...

ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె కలపండి. తర్వాత అలోవెరా జెల్ వేసి మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్న మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత చల్లటి వాష్ చేసుకోండి. అరటి పండులో ఉండే పొటాషియం జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా చేస్తుంది. అలోవెరాలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును స్మూత్ గా మారుస్తాయి. కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును పటిష్టంగా చేస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. ఈ రెండిటిని ఉపయోగించి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గుడ్లు, కలబంద జ్యూస్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విశ్వనాన్ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా పట్టించాలి. తర్వాత జుట్టును క్యాప్ తో కప్పి 30 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత వాష్ చేసుకోండి. పెరుగు, కలబందతో హెయిర్ ప్యాక్ తయారీ చేసుకుని వాడితో జుట్టు పట్టులా మారుతుంది. ఎందుకంటే పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది.

 ఇది జుట్టును మృదువుగా చేసి, పట్టులా మెరిసేలా చేస్తుంది. ఈ ప్యాక్తో తలలోని మృతకణాలు కూడా తొలగిపోతాయి. ఇందుకోసం పెరుగు, అలోవెరా జెల్ తో పాటుగా కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా తరచుగా చేయటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మినీ తరచుగా వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరిగేలా చేస్తాయి. మందార, కలబంద హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ 1 కప్పు, మందార పువ్వు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మొదట ఒక గిన్నెలో అలోవెరా జెల్, మందార పువ్వు పేస్ట్ వేసి కలపాలి. తర్వాత దీన్ని తలకు బాగా పట్టించి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతేకాదు, తలలో చుండ్రులను దూరం చేస్తుంది. నిమ్మరసంతో పాటు అలోవెరా జెల్ ఉపయోగించి తయారుచేసిన హెయిర్ ప్యాక్ జుట్టుకు మేలు చేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించడం వల్ల జుట్టు సాఫ్ట్ గా మారుతుంది. నల్లగా ఒత్తుగా పెరిగిన జుట్టు పట్టులా మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: