రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ జాబితాలో పల్లీలు ముఖ్యమైనవి. ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, రొటీన్లు ఉంటాయి. వేరుశనగలు తినడం వల్ల ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం గుండెకు ఎంతో మంచిది. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేరుశనగ తినటం మంచిది. వేరుశనగలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
కాబట్టి మీరు డయాబెటిస్ ఉంటే వేరుశనగలను భయం లేకుండా తినొచ్చు. వేరుశనగలు విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వేరుశనగలు విటమిన్ ఈ ఉండటంవల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వయస్సు సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు వేరుశనగలకు దూరంగా ఉండాలి. ఇందులో చాలా క్యాలరీలు ఉంటాయి. వేరుశనగలు ఎక్కువగా తినటం వల్ల బరువు పెరుగుతారు. చాలామందికి వేరుశనగ తినటం వల్ల ఎనర్జీ కూడా వస్తుంది. ఇలాంటివారు వీటిని దూరంగా ఉంచాలి. ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.