సిరప్ బాటిల్స్ వాడనివారు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉండనే ఉంటారు. అందుకోసమని తరచూ తల్లిదండ్రులు తమ పిల్లలు సిక్ అయినపుడు సంబంధిత డాక్టరుని సంప్రదించినపుడు మెడిసన్ దాదాపుగా సిరప్ బాటిల్స్ లోనే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే 7 ఏళ్ళు దాటిన వారికి తప్పితే ఆరోగ్య నిపుణులు టాబ్లెట్స్ సూచించరు కాబట్టి! అందుకే దాదాపు చాలామంది ఇళ్లలో బ్రౌన్ కలర్ సిరప్ బాటిల్స్ అనేవి కొలువుదీరుతాయి. ఈ క్రమంలోనే చాలామందికి సిరప్ బాటిల్స్ అనేవి బ్రౌన్ కలర్లోనే ఎందుకు ఉంటాయి? అనే ప్రశ్న తలెత్తకమానదు. అలాంటివారికోసమే ఈ కధనం. మరెందుకాలస్యం... ఇక్కడ పేర్కొన్న కధనం పూర్తిగా చదివి సిరప్ బాటిల్స్ బ్రౌన్ కలర్లోనే ఎందుకు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకోండి!

సాధారణంగా సిరప్ బాటిల్స్ గోధుమ మరియు ఆకుపచ్చ రంగులోనే ఎక్కువగా దిగుతాయి. సిరప్ అనేది నెలలపాటు నిల్వ చేయాల్సి ఉంటుంది. దానికోసం అవి నిల్వ ఉండే బాటిల్స్ ఎక్కువగా గోధుమరంగులోనే ఉండడం ఉత్తమం అని నిపుణులు నిర్ణయించారు. ఎందుకంటే సీసాలలోని ద్రవం సూర్యకాంతి ద్వారా ప్రభావితం కాకూడదని అలా ఆ రంగులోనే ఎక్కువగా బాటిల్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు అని చెబుతున్నారు. సూర్యుడి నుండి వచ్చే UV కిరణాలు స్పష్టమైన సీసాలలో ఉంచినప్పుడు సిరప్ కి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలోనే పలు బ్రాండ్‌ కంపెనీలు బాటిళ్లకు బ్రౌన్ కలర్‌ను ఉపయోగించడం పరిపాటిగా మారింది. ఎందుకంటే బ్రౌన్ కలర్ అనేది UV కిరణాలను సీసాలలోని ద్రవంతో చర్య జరగకుండా ఆపుతుంది. ఇది గరిష్ట మొత్తంలో సూర్యరశ్మిని నిరోధించింది, లోపల ఉన్న ఉత్పత్తికి ఎటువంటి నష్టం జరగకుండా చేస్తుంది.

అంతేకాకుండా బ్రౌన్ బాటిళ్లలో ఉన్న సిరప్ రుచిని మార్చకుండా, కోల్పోకుండా తాజాగా ఉంచుతుందని కూడా నిపుణులు అంటున్నారు. ఈ విధంగా, నేటికీ చాలా కంపెనీలు తమ సిరప్స్ (మెడిసిన్) తయారీలో భాగంగా అత్యధికశాతం బ్రౌన్ కలర్ కలిగిన సీసాలనే ఎక్కువగా తయారు చేస్తాయి. అదేవిధంగా రంగు సిసలు కూడా ఈ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని కూడా విరివిగా వాడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో గోధుమ రంగు సీసాలదే పై చేయిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: