ప్రపంచంలోని పెద్దవారిలో మూడింట ఒక వంతు మంది నిద్రలేమి సమస్యతో పోరాడుతున్నారు. దీనివల్ల చాలామంది నిద్ర మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. ఈ మందులు చాలా దుష్ర్పభావాలను కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ సలహా లేకుండా వాటిని తీసుకోకుండా ఉండాలి. నిద్ర మాత్రల వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం. నిద్ర సమస్యలతో బాధపడే వారికి స్లీపింగ్ మాత్రలు ఉపయోగపడతాయి. తీవ్రమైన నిద్రలేమి సమస్యల విషయంలో వైద్యులు ఈ మందులను ఇస్తారు. స్లీపింగ్ పిల్స్ మెదడులోని రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ఆ రసాయనాలు నియంతరిస్తాయి. ఆ తర్వాత నిద్రలో సమస్య ఉండదు. మరింత తీవ్రమైన సమస్యల విషయంలో డాక్టర్ నిర్ణిత పరిమాణంలో సిఫార్సు చేస్తే, అది సురక్షితంగా ఉంటుంది.
కానీ సాధారణ సమస్యలలో కూడా తీసుకుంటే, అది ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపటం కాయం. అందువల్ల, దీనిని తీసుకోకుండా ఉండాలంటున్నారు పరిశోధకులు. బెంజోడియాజిపైన్- ఈ మాత్రలు తక్షణ ప్రభావాన్ని చూపుతాయి. త్వరగా నిద్రను ప్రేరేపిస్తాయి. వాటిని ఎక్కువగా కాలం ఉపయోగించడం ప్రమాదకరం. నాన్ బెంజోడియాజిపైన్- ఈ మాత్రలు బెంజోడియాజిపైన్ కంటే తక్కువ ప్రభావంతంగా ఉంటాయి. దీని దుష్ప్రభావాలు కూడా తగ్గవచ్చు. హిస్టమైన-2 సెప్టర్ యాంటీ గోనిస్ట్ లు- ఈ మాత్రలు నేరుగా నిద్రను ప్రేరేపించావు కానీ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. మునుపటి రెండు మాత్రల కంటే ఇవి తక్కువ హానికరం. నిద్ర మాత్రలు వేసుకునే వారికి సాధారణ నిద్ర రాకపోవచ్చు. కొన్నిసార్లు మీ రాత్రి అకస్మాత్తుగా మేల్కొనడం జరగవచ్చు. దీన్ని తీసుకోవటం వల్ల నిద్రలేని వంటి సమస్యలు కూడా వస్తాయి.