రామ్ చరణ్ పేరు మీదే ప్రతి టికెట్ తెగాల్సి ఉంటుంది. ఓపెనింగ్స్ మొత్తం రాంచరణ్ భుజాల మీదే ఉంటుంది. రామ్ చరణ్ గత చిత్రాల ఓపెనింగ్స్ గురించి అందరికీ తెలిసిందే. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ వస్తుండేవి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ముగింట ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2 ఉంటాయి. ఇందులో పుష్ప 2 రికార్డుల్ని టచ్ చేయటం సాధ్యం కాదు. పుష్ప 2 ఇండియాలో ప్రస్తుతం ఏ సినిమాకి అందనంత ఎత్తులో ఉంటుంది. పుష్ప 2 ఓపెనింగ్స్, లాంగ్ రన్ రికార్డులను కదలించాలంటే...రాజమౌళి లేదా ప్రభాస్ సినిమాలు రావాల్సి ఉంటుంది.
ఇక ఎన్టీఆర్ దేవరాకు మొదటి రోజు 172 కోట్లకు పైగానే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి మిడ్ నైట్ షోలు కూడా పడ్డాయి. టికెట్ రేట్లు కూడా ఎక్కువే. కానీ గేమ్ చేంజర్ కు మాత్రం బుకింగ్స్ లో దుమ్ము రేపేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటిందని అంటున్నారు. చూడాలంటే డే వన్ విషయంలో గేమ్ చేంజర్ మంచి నవంబర్ ను పెట్టాలని ఉంది. ఇప్పుడున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం... గేమ్ చేంజర్ మొదటి రోజు 170 నుంచి 180 కోట్లకు పైగానే రాబట్టేలా కనిపిస్తోంది.