సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పల్లెల్లో కోడిపందాల సందడి మొదలవుతుంది. బలిష్టంగా తయారై అగ్రేసివ్ గా కనిపించే పుంజులు, వాటిని సిద్ధం చేసే యజమానులు, పందెం కాసే జనం.. ఈ సంక్రాంతి సంస్కృతి మనసులను ఎంతగానో హత్తుకుంటుంది. మరి రెండు రోజుల్లోనే సంక్రాంతి పర్వదినం రానున్న వేళ, దీని వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం పదండి.

కొందరి వాదన ప్రకారం కోడిపందాలు రాజులు, జమీందారుల కాలం నాటి వినోద కార్యక్రమంగా సాగేది. అప్పట్లో యుద్ధాల స్ఫూర్తితో ఈ పందాలు సరదాగా ప్రారంభించారు. శౌర్యం, తెగువకు ప్రతీకగా వీటిని నిర్వహించేవారు. కాలక్రమేణా ఇది గ్రామాల్లోకి చేరి సంక్రాంతి వేడుకల్లో భాగంగా మారిపోయిందని చెబుతారు.

మరికొందరి నమ్మకం మేరకు ఇది దేవతల ఆరాధనలో భాగం. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు కోళ్లను బలిచ్చే ఆచారం ఉండేది. ఆ తర్వాత ఆ ఆచారం కాస్తా కోడిపందాలుగా రూపాంతరం చెందిందని కొంతమంది అంటారు. ఇంకా చెప్పాలంటే, ఇది పంటలు చేతికి వచ్చిన సంతోషంలో రైతులు జరుపుకునే వేడుకల్లో ఒక భాగంగా కూడా చూడొచ్చు.

ఏదేమైనా, కోడిపందాలు సంక్రాంతి సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు.. గ్రామస్తులు ఒకచోట చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వేదిక. అయితే, ఈ పందాల్లో హింస, జూదం వంటి అంశాలు ఉండటం వల్ల ఇది వివాదాస్పదంగా మారింది. కోడి పందాలు సినిమాల్లో కూడా బాగా హైలైట్ అయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కోడిపందాలు ఎలా నిర్వహిస్తారు తమిళనాడు వంటి చోట్ల కూడా కోళ్లకు పందాలు నిర్వహిస్తారు. దీనిపై ధనుష్ ఒక సినిమా కూడా చేశాడు.

చట్టాలు ఎన్ని ఉన్నా, సంక్రాంతి సమయంలో కోడిపందాలు మాత్రం ఆగడం లేదు. ఇది తరతరాలుగా వస్తున్న సంస్కృతి అని కొందరు సమర్థిస్తుంటే, మూగజీవులను హింసించడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, కోడిపందాలు మాత్రం సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన కలర్‌ఫుల్ వైబ్‌ని తీసుకొస్తాయి. ఈసారి ఇవే అంత జోరుగా జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: