అదే గజిబిజిగా కనిపిస్తుంటారు. చూడు బాస్... ఎన్నాళ్లయ్యింది అమ్మ ఒళ్లో తలవాల్చక..? ఎన్నేళ్లయ్యిందో నాన్న చెయ్యి పట్టుకొని నడవక ..? ఎందుకి చికాకులు..? అని పక్కకు పెట్టి అమ్మానాన్నల ప్రేమను ఆశీర్వదిస్తే సంక్రాంతి ఇంకాస్త సందడిగా ఉంటుంది. చిన్నాళ్ల తర్వాత... అమ్మ నాన్న స్పర్మతో మనసెంత పులకరిస్తుందో ఊహించుకుంటేనే అదో కిక్కుంది. అన్ని పండగల్లో సంక్రాంతి వెరీ స్పెషల్. ముచ్చటగా మూడు రోజులు ఉంటుంది కదా. భోగిమంటలు... గంగిరెద్దుల వినాశాలు... హరిదాసుల పాదాలు ఇలా చాలా ఉంటాయి. ఇక పిండి పంటలదైతే హైలెట్. తిరోక్క వంటలతో సంక్రాంతికి స్పెసి షూటెక్కుతుంది. సిటీల్లో రకరకాల స్టాటర్స్.. ఫాస్ట్ ఫుడ్... జంక్ ఫుడ్ తిని హెల్తీ ఫుడ్ కు దూరమై ఉంటారండి. అమ్మ చేతి వంట రుచి చూడగా అన్ని రోజులైందో పాపం.
ఊర్లో ఉన్నానని రోజులు మీ పాకశాస్త్ర పైత్యాన్ని అక్కకు పెట్టి... కాస్త అమ్మ చేతి వంటను ఆస్వాదించండి. హ్మ్... అమ్మ చేతి వంట అనగానే నీళ్లూరుతున్నయ్ బాస్... పండక్కి ఎంజాయంటే పిల్లలదే. ఆటలు... పాటలు... డాన్సులతో పుల్లు బిజి. కానీ ఇప్పటి పిల్లలకు ఆటలంటే ఆన్లైన్ గేమ్స్. మీరు వెళ్ళండి పండగకు సార్. మీ సంబరాల్లో మీరు మునిగి వాళ్లను మటుకు ఫోన్లకు... టీవీలకు పరిమితం చేస్తారా ఏంటి..? బయట తిప్పండి. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో అటాచ్ చేయండి.పిల్లలతో స్పెండ్ చేశామన్న సంతృప్తి వాళ్ళకంటుంది. పెద్దలతో పంచుకునే ఛాన్స్ పిల్లలకు దొరుకుతుంది. మార్కులు... గ్రాండ్ టోటల్సే కాదు. గ్రాండ్ పేరెంట్స్ టచ్ కూడా అవసరమే అని తెలుసుకునే అవకాశం కల్పించినట్లవుతుంది.