చలికాలంలో దగ్గు మరియు జలుబు వంటివి చాలా కామన్ . దీనికోసం తేనె మరియు నల్ల మిరియాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు ‌. ఇది అనేక ఆరోగ్య సమస్యలు నయం చేస్తుందని అంటున్నారు . ఆయుర్వేదంలో తేనే మరియు నల్ల మిరియాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని చెబుతున్నారు . నల్ల మిరియాలను తేనె లో కలిపి నవలడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు కూడా . జలుబు మరియు దగ్గు అదే విధంగా గొంతు నొప్పి వంటి సిజిరియల్ వ్యాధులను దూరం చేస్తాయి ఇవి . మరిన్ని లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం .

జలుబు మరియు దగ్గు వాటికి నల్ల మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి . ఆయుర్వేదం ప్రకారం జలుబు అండ్ దగ్గు సమస్యలు ఉన్నవారు ఎండు మిరియాల పొడిని తేనెలో కలిపి తినాలి . ఈ సమస్యలను తొలగించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది . ముక్కు అదేవిధంగా గొంతు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి పడుకునే ముందు చిటికెడు మిరియాల పొడిని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకోండి . మంచి ఉపశమనం లభిస్తుంది . అంతేకాకుండా డెంగ్యూ ప్రభావాలను తగ్గించడంలో కూడా ఇది మేలు చేస్తుంది .

డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారు దీన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు ‌ . తేనె నల్ల మిరియాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి . ఇది రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది . విటమిన్ కే అండ్ ఐరన్ మరియు పొటాషియం వంటి ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు తేనెలో ఉంటాయి . నల్ల మిరియాలు మరియు తేనెలో యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఆంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు దాగి ఉంటాయి . ఇది మధుమేహం మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి . ఇందుకోసం చిటికెడు నల్ల మిరియాలు మరియు తేనెతో కలిపి తిన్న తరువాత అరగంట పాటు నీళ్లు తాగకూడదు . దీంతో గొంతులో కఫం మరియు నోటి దుర్వాసన అదేవిధంగా దగ్గు వంటి సమస్యలు నయమవుతాయి . ఎన్ని ప్రయోజనాలు ఉన్న నల్ల మిరియాలు మరియు తేనెని అస్సలు మిస్ కాకుండా ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: