నాడు కోవిడ్ 19, నేడు హ్యూమన్ మెటాన్యూ వైరస్, అంతకుముందు ఇంకెన్నో... ఇలా రకరకాల వైరస్ల దాడి పెరుగుతూనే ఉంది. నెలరోజుల ముందు వరకు చైనాకే పరిమితమైందనుకున్న హెచ్ఎండివి ప్రస్తుతం భరత్ కు చేరింది. ఇక్కడ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. అదే సందర్భంలో ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. అందుకోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో వైరస్ ముప్పును ఎదుర్కోవటానికి తగ్గిన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ఒకటి.

అందుకోసం ఉపయోగపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ అనే కాదు, మనల్ని అనారోగ్యానికి గురి చేసే అనేక రకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఆల్రెడి మన శరీరంలో కూడా ఉంటాయి. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పడిపోతుందో అప్పుడు వాటి ప్రభావం పెరుగుతుంది. దీంతో వ్యాధుల బారిన పడుతుంటాం. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రోజు భార్య ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ పంటివి తీసుకుంటూ ఉండాలి.

అట్లానే విటమిన్ ఏ, సి, డి, ఇ, అట్లానే జింక్, సెలీనియం లభించే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు పోషక ఆహార నిపుణులు. రోగ నిరోధక శక్తి పెంచడంలో నారింజ, నిమ్మ, దానిమ్మ, దాక్ష వంటి సిట్రిస్ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు అయిన వీటిని తినాలి. దీంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే పాలకూర, బ్రోకలీ, తోటకూర, పుంటి కూర వంటివి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు, క్యాబేజీ, క్యారెట్, బీట్ రూట్ వంటివి ఆరోగ్యకరమైన గట్ ను నిర్వహించడానికి సహాయపడతాయి. అంటే పేగులు హల్దీగా ఉంటేనే ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: