ఇలాంటి పరిస్థితి ట్రాఫిక్ లో శబ్ద కాలుష్యాన్ని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. మెట్రో సిటీలల్లో అయితే ట్రాఫిక్ సౌండ్ వల్ల శబ్ద కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో చాలామంది అవర్ధాలు పడుతున్నారు. ఉద్యోగులు, వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వినిపించే వాహన శబ్దాలు, హారంలో మోతలకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. మన దేశమే కాదు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రమాదకర కాలుష్యాల్లో శబ్ద కాలుష్యం కూడా ఒకటని అధ్యాయనాలు పేర్కొంటున్నాయి. పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, దీనివల్ల వెలువాడే శబ్దాలు మానవ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నట్లు యూఎస్, డెన్మార్క్, స్విడ్జర్లాండ్, జర్మానికి చెందిన శాస్త్రవేత్తల ఆధ్యాయంలోనూ వెళ్లడైంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, సర్క్యులేషన్ రీసెర్చ్ జనరల్ స్టడి ప్రకారం కూడా ట్రాఫిక్ శబ్దాలతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది.
ఇది మానసిక గందరగోళం, అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల రిస్క్ ను పెంచుతోంది. రోడ్లు, రైళ్లు, విమానాల నుంచి వచ్చే శబ్దాలు తరచుగా వినే వారిలో కార్డియో వాస్క్యులర్ వ్యాధులు, మధుమేహం, స్ట్రోక్ రిస్క్ పెరిగే అవకాశం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ట్రాఫిక్ సౌండ్ వల్ల పశ్చిమ అ ఐరోపాలో ఏటా 1.6 మిలియన్ల మంది ప్రజలు తమ ఆరోగ్యకరమైన జీవితాన్ని కోల్పోతున్నారట. రాత్రింబవళ్లు కూడా ట్రాఫిక్ శబ్దాలు రిస్క్ ను పెంచుతున్నాయి. అధిక శబ్దాలు కొందరిని ఒత్తిడికి గురి చేస్తుంటే... మరి కొందరిలో రాత్రి సమయంలో నిద్రకు ఆటంకం కలిగిస్తూ మానసిక గందరగోళానికి కారణం అవుతున్నాయి. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్ల రిలీజై రక్తనాళాలు, మెదడుపై ప్రభావం చూపడం వల్ల అధిక రక్త పోటుకు దారితీస్తుంది.