దక్కన్ చికెన్ హోటల్ కూల్చివేతలో కోర్ట్ ఆదేశాలున్న పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుపాటి కుటుంబంపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరిపాలని నాంపల్లిలోని 17వ నెంబరు కోర్ట్.. ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది . కోర్ట్ ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుపాటి వెంకటేష్ మరియు నిర్మాత సురేష్ బాబు , హీరో రానా మరియు హీరో అభిరామ్ పై శనివారం ఫిలిమ్ నగర్ పోలీసులు 448,452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు . అనంతరం విచారణ ప్రారంభించారు . గతంలో నందా కుమార్కు చెందిన టకం చికెన్ హోటల్ అంశంలో దగ్గుపాటి కుటుంబంతో స్థలం వివాదం చాలా రేగింది . దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది . కాగా 2022 నవంబరు లో జిహెచ్ఎంసి సిబ్బంది బోసర్లతో కలిసి హోటల్లు పాక్షికంగా వంశం చేశారు .
సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు . 2024 జనవరిలో హోటల్ను దగ్గుపాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చివేసింది . దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాయంపల్లి కోర్టుకు వెళ్ళగా శనివారం ఈ కేసులో దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు . కోర్ట్ ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేష్ మరియు సురేష్ బాబు , రానా , అభిరాములు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందా కుమార్ ఏళ్లుగా పోరాడుతున్నారు . కాగా శనివారం 11న నాంపల్లిలోని 17వ నెంబరు కోర్టు దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని కోర్ట్ ఆదేశాల ఉల్లంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది .