ప్రోమోస్ ట్రీమింగ్ లోనే బాలయ్య బాబు మాట్లాడుతూ... " మెగాస్టార్ తనయుడుగా పుట్టాడు .. బాబాయ్ పవర్ స్టార్ పవర్ తో పెరిగాడు .. ఇద్దరి శక్తి కూడుకుని పాన్ ఇండియా లెవెల్ లో మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు " అంటూ రాంచరణ్ గురించి ప్రశంసల వర్షం కురిపించాడు . ఇక అనంతరం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటిలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నావు .. ఇప్పుడు ఇంత సక్సెస్ అందుకున్నావు .. ఒకవేళ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయి ఉంటే ఏం చేసే వాడివి అని రాంచరణ్ బాలయ్య బాబు ప్రశ్నించగా .. " చావైనా బతుకైనా ఇక్కడే " అంటూ ఇండస్ట్రీపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ప్రజెంట్ రామ్ చరణ్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ వీడియోని చూసిన చెర్రీ ఫ్యాన్స్ రామ్ చరణ్ ను అభినందిస్తున్నారు . ఇక రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ . ఈ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే . అదేవిధంగా హెచ్డి ప్రిన్స్ వారం కాకముందే సోషల్ మీడియాలలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు చింతిస్తున్నారు . మరి దీనిని మూవీ యూనిట్ ఏ విధంగా అడ్డుకోనో చూడాలి .