టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ నిలిచాడు . ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా నటించిన సంగతి తెలిసిందే . ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను సాధించింది . ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన సైతం విడుదల చేశారు . ఇక ఇదిలా ఉంటే మూవీ విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టారు . చేతిపై హనుమంతుడి గదా పచ్చబొట్టుగా వేయించుకున్నట్లు ట్విట్ చేశారు .
కాగా హనుమాన్ లో అమృత అయ్యర్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ అదేవిధంగా వినయ్ రామ్ , వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు . ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందుతుంది . దీనికి జై హనుమాన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు చిత్ర బృందం . ఇందులో కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషించాడు . ఇప్పటికే ఆయన లుక్ ను విడుదల చేయగా .. అది అందరిని ఆకట్టుకుంది . మరి 2025లో జః హనుమాన్ మూవీ ఇంకెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి .