పొగ భాగ్యాలను ఇచ్చే భోగి రోజున భోగి మంటలు వేసి ఆవు పిడకలతో చేసిన పిడకలను ఆ మంటల్లో వేసి భోగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు . ఎముకలు కోరికే చలిని తరిమి కొడతారు . సాయంత్రం చిన్నపిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీసి భోగి పళ్ళు పోస్తారు . పేరంటము కూడా జరుపుతారు . ఇలా చేయడం వలన పిల్లలకు దిష్టి దోషం తొలగిపోతుందని భావిస్తారు . భోగి రోజున సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోయడం ఆచారంగా వస్తుంది . భోగి పండుగ రేగుపల్లును ఉపయోగిస్తారు . రేగి పళ్ళు మరియు బంతిపూల రేఖలు అదేవిధంగా చిల్లర డబ్బులును కలిపి పోస్తారు . ఈ రేగి పళ్ళను పిల్లల తల మీద నుంచి పోస్తారు .
ఇలా చేయడం వలన విష్ణువువి అనుగ్రహం లభిస్తుందని అంటారు . భోగి పళ్ళు పోయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటంటే పిల్లల తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది . భోగి పండ్లను పోసి దాని ప్రేరేపటం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని అంటూ ఉంటారు . రేగి పండ్లను బదరీ పిలాలంటారు . అంటే రేగు పండ్లు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు . శివుని ప్రసన్నం చేసుకోవడానికి నారా నారాయణలు బదరికావనం లో ఘోర తపస్సు చేశారట . ఇందువల్లే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు .