ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలకు సరిహద్దు ప్రాంతం అయినా ఎన్టీఆర్, ఏలూరు, రంపచోడవరం జిల్లాలతో పాటు రాజమండ్రి మరియు గుంటూరు అదే విధంగా విజయవాడ వంటి మహా నగరాల్లో కోడిపందాలు నిర్వహిస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్తున్నారు . జిల్లా వ్యాప్తంగా పంతం రాయలపై పోలీసులు ఉక్కు పాదం మోపారు . ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన మధిర , సత్తుపల్లి, అసరావుపేట వంటి ప్రాంతాలు ఆంధ్ర సరిహద్దు కు అనుకోని ఉండటంతో 15 రోజులుగా వందలాదిమంది పందెం రాయాళ్లను బైండోవర్ చేశారు .
ఏపీలో అన్ని జిల్లాలతో పాటు ముఖ్య నగరాలలో కోడిపందాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయినట్లుగా సోషల్ మీడియా వేడుకగా ప్రచారం జరుగుతుంది . మూడు రోజులు జరిగే కోడిపందాలు లోన బయట పేకాటలతో ఈ మూడు రోజులు దద్దరి వెళ్ళిపోతూ ఉంటుంది . అంతేకాకుండా అనేక గేములతో మూత మోగుతూ ఉంటుంది కూడా . ఇక కోడిపందాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆంధ్ర . అందుకే విదేశాల నుంచి కూడా కోడిపందాలకు ఆంధ్రకు పరుగులు తీసుకుంటూ వస్తున్నారు పందెం రాయళ్ళు . కోడిపందాలలో తమ వంతు డబ్బును పెట్టి దానిని రెట్టింపు చేసుకోవాలని చూస్తూ ఉంటారు . మరి వీరి ఆశలు ఎంతవరకు నిలబడతాయో చూడాలి .