ఇంటి ముందు ఏ ముగ్గు వేస్తే బాగుంటుందో అని google లో తెగ సర్చ్ చేస్తూ ఉంటారు కూడా . గంటల తరబడి ఆడవాళ్లు ఎంతో సంతోషంగా వాకిట్లో ముగ్గులు వేసి వాటిలో రంగులు నింపుతారు . అయితే ముగ్గు వేయడం తొందరగా అయిపోయినప్పటికీ రంగులు వేయడం మాత్రం కాస్త టైం పడుతూ ఉంటుంది . కాగా ఎంత పెద్ద ముగ్గు అయినా సరే 10 నిమిషాలలో రంగులు నింపే అదిరిపోయే చిట్కా మా దగ్గర ఉంది . మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం . ఒక ప్లాస్టిక్ కప్ తీసుకుని దాని అడుగు భాగంలో సూది లేదా పినీస్ తో చిన్నచిన్న హోల్స్ చేయండి . తర్వాత దానిలో రంగులు నింపుకునే ముగ్గులు వేసారంటే పదే పది నిమిషాల్లో ముక్కు కలర్ ఫుల్ గా మారుతుంది .
అలాగే రెండు టీ కప్పుల్ని తీసుకోండి . అడుగు భాగాలను కత్తిరించి నెట్ క్లాస్ పెట్టి ఈ కప్పు మరో కప్పు లో వేసి రంగులు అందులో పోసి ముగ్గులో నింపండి . ఇలా కూడా ముగ్గులో రంగులు పది నిమిషాల్లో నింపవచ్చు . ఇలా ట్రై చేసి ముగ్గులు రంగులు నింపినట్లైతే చాలా నీట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది . ఆధారంగా చేతితో వేసినప్పుడు కొంచెం అటు ఇటు వెళుతూ ఉంటుంది . కానీ ఇలా వేయడం వలన అస్సలు ఎటు పోదు . ముగ్గు అందంగా కనిపిస్తుంది . మరి ఇంకెందుకు ఆలస్యం పండగ మూడు రోజులు ఈ టిప్ ని ఫాలో అయ్యి మీ గుమ్మం ముందు అందమైన ముగ్గులను వేయండి .