చాలామందికి ముక్కనుమ గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. సంక్రాంతి మూడు రోజుల పండుగగా స్థిరపడిపోయింది. కానీ, కొన్ని సంప్రదాయాలు మాత్రం ఈ వేడుకను మరో రోజు పొడిగిస్తాయి. అలా సంక్రాంతి చివరి రోజున జరుపుకునే పండుగే ముక్కనుమ.
ముక్కనుమ రోజున గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఊరి ప్రజలందరూ కలిసి గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. తమ ఊరిని, తమను చల్లగా చూడమని వేడుకుంటారు. కనుమ రోజు మాంసాహారం తిననివారు చాలామంది ముక్కనుమ రోజున విందు చేసుకుంటారు. ఇక మాంసం ప్రియులకు ఇది పండగే పండగ.
ఈ ముక్కనుమ సంబరాలు ఎక్కువగా తమిళనాడులో కనిపిస్తాయి. అక్కడ దీన్ని ‘కరినాళ్’ అని పిలుస్తారు. సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఈ రోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందంగా గడుపుతారు.
కాబట్టి, ఈసారి సంక్రాంతికి మీరెక్కడైనా నాలుగు రోజుల వేడుకలు చూస్తే ఆశ్చర్యపోకండి. అది మన సంస్కృతిలోని ముక్కనుమ ప్రత్యేకత. సంక్రాంతి పండుగలోని ఈ అదనపు రోజు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఈ పండుగను సెలబ్రేట్ చేస్తారు మీ చోట కూడా సంక్రాంతి నాలుగో రోజు సంబరాలు జరుపుకుంటున్నారా.. కామెంట్ సెక్షన్లో ఆ విషయాన్ని మీరు తెలియజేయవచ్చు.