సంక్రాంతి పండుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాల జోరు ఈ సారి మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. పందెం రాయుళ్లు లక్షలు, కోట్లు గుమ్మరించారు. ఈ సంక్రాంతికి ఎప్పటి లాగానే కోడిపందాలలో అదే సీన్ రిపీట్ అయింది. వెస్ట్ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో జరిగిన ఓ కోడి పందెం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏంటంటే.. అక్షరాలా ఒక్క కోటి రూపాయలు పందెం కాశారు. ఈ పందెం గురించే గత కొన్ని రోజులుగా తెగ చర్చించుకుంటున్నారు.

కుక్కుట శాస్త్రం ప్రకారం సంక్రాంతి రోజున ఈ పందెం ఘనంగా జరిగింది. గుడివాడకు చెందిన ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఈ పందెంలో విజేతగా నిలిచాడు. రత్తయ్య రాసాగి అనే వ్యక్తి పుంజుపై గెలిచి ఏకంగా 25 లక్షలు కొట్టేశాడు. అంతే సంగతులు.. ఈ వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. నెటిజన్లు దీనిపై తెగ చర్చించుకుంటున్నారు.

* సైలెంట్ గా ఉంటేనే సేఫ్ రా బాబు..

ఇదిలా ఉండగా.. ఇదే సంక్రాంతి పందాల్లో జరిగిన మరో ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఐదు కోళ్లను బరిలోకి దింపారు. అక్కడ ఒక గీత గీసి వాటిని వదిలేశారు. అంతే.. ఇక వాటి మధ్య ఫైటింగ్ మొదలైంది.

నాలుగు కోళ్లు మాత్రం ఫుల్ జోష్‌లో ఒకదానిపై మరొకటి ఎగిరి తన్నుకున్నాయి. కానీ.. ఐదో కోడి మాత్రం సైలెంట్‌గా ఒక మూలన నిలబడి చూస్తూ ఉండిపోయింది. మిగతా నాలుగు కోళ్లు కొట్టుకుని కొట్టుకుని అలసిపోయి ఒక్కొక్కటిగా కింద పడిపోయాయి. చివరికి ఏం జరిగిందంటే.. ఏ కోడి అయితే సైలెంట్‌గా ఉండిపోయిందో.. అదే గెలిచింది. దీంతో ఆ కోడిపై పందెం కాసిన వాళ్ల పంట పండింది. భారీ మొత్తం సొంతం చేసుకున్నారు.

ఈ వింత సంఘటనను అక్కడున్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే.. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో "సైలెంట్‌గా ఉంటేనే సేఫ్ రా బాబు" అంటూ జోకులు పేలుస్తున్నారు. మరికొందరేమో పాత "ఈట్ ఫైవ్ స్టార్.. డూ నథింగ్" యాడ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఇక పందెం గెలిచిన వాళ్లయితే ఆ కోడికి దండాలు పెడుతూ "థాంక్యూ కోడిపుంజు రాజా.. ఏం చేయనందుకు థాంక్స్" అంటూ హిలేరియస్ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సంక్రాంతి కోడి పందాల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: