మనవడితో ఎంతో సరదాగా ఉల్లాసంగా , సరదాగా , సాధారణ  మనిషిలా సైకిల్‌పై వీధుల్లో తిరుగుతున్న ఏడుపదుల వయసున్న ఈ పెద్దాయన ఎవరో గుర్తుపట్టారా.. అగ్ర సెలబ్రటీల కుటుంబంలో జన్మించి ఉన్నతమైన చదువులతో ప్రజల నాడీ ఇట్టే కనిపెట్టగల ఆ వ్యక్తి .. మ‌న‌ తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో సుప్రచితుడు .. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా తన సొంత ఊరులో కొడుకు , కూతుళ్లు , మన వాళ్ళతో కలిసి సరదాగా ఇలా ఆనందంగా గడుపుతున్నాడు .. తన మనవడ్ని  వీపుపై ఎక్కించుకుని ఎంచక్కా సైకిల్ ఎక్కి వీధుల్లో తొక్కుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పెద్దాయన ఎవరు అనుకుంటున్నారా ?


బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కారంచేడు స్వగ్రామంలో సైకిల్ పైకి చక్కర్లు కొడుతున్న ఈ పెద్దాయన నటరత్న సీనియర్ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు , ఆయన తన కుటుంబ సభ్యులతో తన సొంతూరికి వెళ్లి సంక్రాంతి వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. కొడుకులు , కూతుళ్లు మన వాళ్ళతో కలిసి సంక్రాంతి పండగ సందర్భంగా తన సొంతూరు కారంచేడుకు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు .. తన భార్య బీజేపీ చీఫ్ , ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి తో కలిసి భోగి వేడుకలు మొదలు కనుమ పండగ వరకు పండగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సమయంలోనే తన కుమారుడు హితేష్ చెంచురామ్ చిన్న కొడుకు రుద్రవరామ్‌ని సైకిల్ పై ఎక్కించుకొని గ్రామంలోని వీధుల్లో తొక్కడు.


ఏడు పదుల వయస్సులో కూడా సైకిల్ తొక్కుతూ చిన్న మనవడితో ఎంతో ఎంజాయ్ చేశాడు. మీకంటే నేను తక్కువ కాదంటూ పెద్ద మనవడు భైరవ రామ్ చిన్న సైకిల్ తో తాతను దాటించి వెళ్ళిన దృశ్యాలు అక్క‌డ ఉన్న జనాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .. అయితే ఈ వీడియోలో చూసిన దగ్గుబాటి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇక గత సంవత్సరం కారంచేడిలో తన అక్క పురందేశ్వరి ఇంటికి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చి సంక్రాంతి వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే .. ఈ సంవత్సరం కూడా ఈ దగ్గుబాటి దంపతులు సంక్రాంతి పండుగ సంబరాలను తమ సొంత ఊరులో ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: